పరిమితి దాటిన పరిణీతి.. హాట్ బికినీ షో!

Thu Jun 10 2021 12:00:01 GMT+0530 (IST)

Parineeti Chopra Latest Photo

బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ పరంగా ఆకట్టుకునే వయ్యారి భామలు ఎంతోమంది ఉన్నారు. కానీ గ్లామర్ ప్రియులకు కొందరు మాత్రమే ఫేవరేట్ అవుతుంటారు. మరి ప్రేక్షకులకు ఫేవరేట్ కావాలంటే అన్ని విషయాల్లోను ఆకట్టుకోవాలి. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచం అంటే ఖచ్చితంగా ఉండాల్సింది అందమైన శరీరాకృతి. ఈ విషయంలో ఒకప్పుడు ఫెయిల్ అయినా కష్టపడి మంచి నాజూకుగా ఫిగర్ మెయింటైన్ చేస్తున్న హీరోయిన్స్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే కెరీర్ ప్రారంభంలో ఎంతో బొద్దుగా కనిపించి గ్లామర్ పాత్రలకు అమ్మడి ఫిగర్ పనికిరాదు అనే కామెంట్స్ ఫేస్ చేసింది.కానీ ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ ఫిగర్స్ లో ఒకటిగా నిలుస్తుంది. నిజానికి పరిణీతి లావుగా ఉండటంతో కెరీర్ ప్రారంభంలో అవకాశాలు అంతగా రాలేదు. దీంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అమ్మడు బాగా డైట్ చేసి నడుము సైజును ఏకంగా 38 నుంచి 30కి తగ్గించేసింది. తాను నాజూకుగా మారానని చెప్పుకోవడానికి వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ గుర్తుచేసింది. ఎప్పుడైతే వయ్యారి నాజూకుగా మారిందో అప్పటినుండి స్టార్ హీరోల సినిమాలు కూడా చేస్తూ వచ్చింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు రొమాంటిక్ రోల్స్ - బికినీ సీన్స్ కూడా నిస్సందేహంగా చేసేస్తోంది.

ఈ గ్లామరస్ బ్యూటీ ఈ ఏడాది ప్రేక్షకులను మూడు సినిమాలతో ఆకట్టుకుంది. కాకపోతే అవన్నీ కూడా ఓటిటి రిలీజ్ కావడం జరిగింది. ఇదిలా ఉండగా పరిణితి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా చెల్లిగా అడుగుపెట్టినప్పటికీ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇదివరకు పరిణితిని కేవలం క్యారెక్టర్ హీరోయిన్ గా మాత్రమే చూసేవారు. కానీ వయ్యారి అందాల ప్రదర్శనకు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం దాసోహం అంటోంది. తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా బీచ్ లో బికినీ ధరించిన పిక్ షేర్ చేసింది. ఆ ఫోటోలో బికినీ ధరించి అమ్మడు కూర్చొని ఫోటోకు పోజిచ్చింది. బ్లాక్ కలర్ టు పీస్ బికినీలో పరిణితి గ్లామర్ షో పరిమితి దాటిందనే చెప్పాలి. ప్రస్తుతం వయ్యారి టర్కీలో ఉన్నట్లు పోస్ట్ పెట్టింది. మొత్తానికి బికినీ షోతో ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది ఈ వయ్యారి. ప్రస్తుతం పరిణితి అనిమల్ అనే సినిమాలో నటిస్తోంది.