Begin typing your search above and press return to search.

ప్రేక్షకుల ను పరేషాన్ అయ్యేలా చేశారు..!

By:  Tupaki Desk   |   2 Jun 2023 1:58 PM GMT
ప్రేక్షకుల ను పరేషాన్ అయ్యేలా చేశారు..!
X
మసూద సినిమా తో లైం లైట్ లోకి వచ్చిన తిరువీర్ లేటెస్ట్ గా పరేషాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రూపక్ రొనాల్డ్ సన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రానా సపోర్ట్ తో ప్రేక్షకుల్లోకి వెళ్లింది. ఇక నేడు సినిమా రిలీజైన సినిమా టాక్ ఆశించిన స్థాయిలో లేదు. ఇంతకీ పరేషాన్ కథ ఏంటని చూస్తే.. తెలంగాణ లో మంచిర్యాల కోల్ మైన్ లో సమర్పణ్ (మురళీధర్ గౌడ్) పనిచేస్తుంటాడు.

అతని కొడుకు ఐజాక్ (తిరువీర్) అతని స్నేహితులు సత్తి, పాషా, ఆర్జీవి లతో కలిసి ఆవారాగా తిరుగుతుంటాడు. ఐజాక్ ఏం పని చేయకపోయినా అతన్ని ప్రేమిస్తుంది శిరీష్ (పావని కరణం). అలా అంతా బాగానే జరుగుతుంది అనుకునే టైం లో తండ్రి ఉద్యోగాన్ని ఐజాక్ కు ఇప్పించే క్రమంలో కొంత మొత్తం డబ్బుని ఒకరికి ఇవ్వమని అంటాడు.

ఈలోగా ఐజాక్ ఫ్రెండ్ ఆపద లో ఉంటే అతనికి డబ్బు ఇస్తాడు. ఈ లోగా అతని ప్రేయసి శిరీష్ కూడా ప్రెగ్నెంట్ అని తెలుసుకు ని ఆమెకు అబార్షన్ చేయించడం కోసం డబ్బులు సెట్ చేసుకుంటాడు. డబ్బు తీసుకెళ్లిన ఫ్రెండ్ మోసం చేస్తాడు. తన ప్రేమ విషయం ఇంట్లో తెలుస్తుంది. డబ్బులు కూడా పోగొట్టుకున్నాడని ఐజాక్ తండ్రికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది అన్నదే పరేషాన్ కథ. తెలంగాణ నేపథ్యంతో ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. పరేషాన్ కూడా తెలంగాణా పల్లె.. అక్కడ వాతావరణాన్ని చూపించాడు.

రొటీన్ కథ కు తెలంగాణ బ్యాక్ డ్రాప్ జోడించి సినిమా నడిపించాడు తప్ప దర్శకుడు ఇందులో చేసింది ఏమి లేదు. అంతేకాదు ఎమోషనల్ గా నడిపించాల్సిన సీన్స్ లో కూడా ఆశించిన స్థాయిలో ఎమోషన్ పండలేదు. ఇక మరోపక్క కామెడీ కూడా అన్ని చోట్లా వర్క్ అవుట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ కొంతమేర కు పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ అక్కడక్కడ కామెడీ సీన్స్ తప్ప సినిమా అంతా రొటీన్ గానే అనిపిస్తుంది. సినిమా పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించడంలో విఫలమైంది.

రానా ఈ సినిమా ఏం చూసి సపోర్ట్ చేశాడో కానీ సినిమా అంతా రొటీన్ కామెడీ రొటీన్ కథ కథనాల తో నడిపించాడు డైరెక్టర్. తెలంగాణ నేపథ్యంతో కేవలం ఇలాంటి కథలు మాత్రమే ఉంటాయా మరో కథలు ఉండవా అనేలా చేశారు. సినిమాలో ఎక్కువ తాగుడు సీన్స్ చిరా కు కలిగిస్తుంది. ఎంత ఆడియన్ కనెక్ట్ అవుదామనుకున్నా పాత్రల మధ్య ఎమోషన్ అంతగా మెప్పించేలా ఉండదు. అందుకే సినిమా ఏవో కొన్ని నవ్వుల కోసం తప్ప పరేషాన్ నిజంగానే పరేషాన్ చేశారు కదా అనేలా ఉంది.