Begin typing your search above and press return to search.

సారీ.. నేను చనిపోలేదు పడుకుని ఉన్నా

By:  Tupaki Desk   |   15 May 2021 5:30 AM GMT
సారీ.. నేను చనిపోలేదు పడుకుని ఉన్నా
X
బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న పరేష్‌ రావల్‌ చనిపోయారు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఆయన మృతికి కొన్ని వేల మంది సంతాపం కూడా తెలిపారు. ఆయన మృతికి సంబంధించిన వార్తలను పలు వెబ్‌ మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. దాంతో బాలీవుడ్ వర్గాల వారు కూడా కొందరు సంతాపం తెలియజేశారు. కొందరు కన్ఫర్మ్‌ చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఫోన్‌ లు చేశారట. దాంతో పరేష్‌ రావల్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించాడు. ఆయన చనిపోలేదంటూ క్లారిటీ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తాను మరణించినట్లుగా వచ్చిన వార్తలపై పరేష్‌ రావల్‌ విభిన్నంగా స్పందించాడు. ఉదయం 7 గంటల సమయంలో సినీ నటుడు పరేష్‌ రావల్ చనిపోయాడంటూ వచ్చిన వార్త కథనంను రీ ట్వీట్‌ చేసి.. క్షమించాలి నేను ఆ సమయంలో నిద్ర పోతున్నాను.. మీరు తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ ఫన్నీగా కామెంట్‌ పెట్టాడు. ఈమద్య కాలంలో కరోనాతో పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు మృతి చెందుతున్న కారణంగా పరేష్‌ రావల్ మరణ వార్త కూడా నిజం అయ్యి ఉంటుందని చాలా మంది భావించారు. కాని ఆయన స్పందన తర్వాత క్లారిటీ వచ్చేసింది.

బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా పరేష్‌ రావల్‌ సుపరిచితుడు. వర్మ సినిమాల్లో ఎక్కువగా గతంలో కనిపించిన ఈయన తెలుగు ప్రేక్షకులకు లింగం మామగా ఎప్పటికి గుర్తుండి పోతాడు. చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఈయన నటన సినిమాకే ప్రధాన ఆకర్షణ గా నిలిచింది అనడంలో సందేహం లేదు. అలాంటి పరేష్ రావల్‌ గురించి వచ్చిన సోషల్‌ మీడియా పుకార్లతో టాలీవుడ్‌ వర్గాల వారు మరియు తెలుగు ప్రేక్షకులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకు వస్తాయో కాని కొన్ని గంటల పాటు నెట్టింట వైరల్‌ అవుతాయి.