దళపతి మూవీనే కాపీ కొట్టి ఆస్కార్ కొట్టేశారట!

Tue Feb 11 2020 09:50:27 GMT+0530 (IST)

Parasite is Best Picture Oscars 2020 Winner

ఆస్కార్ పురస్కారాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజు గురించి చెప్పాల్సిన పనే లేదు. 2019-20 సీజన్ కి తాజాగా ఆస్కార్ అవార్డుల్ని ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా చిత్రం `పారాసైట్` (పరాన్నజీవి) ఉత్తమ చిత్రం- ఉత్తమ స్క్రీన్ ప్లే- ఉత్తమ విదేశీ చిత్రం విభాగాల్లో నాలుగు ఆస్కార్ లు గెలుచుకుంది. ఒక దక్షిణ కొరియా చిత్రం ఇన్ని పురస్కారాల్ని కొల్లగొట్టడం పై ఇతర సినీ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.అయితే అకాడెమీ కమిటీ మనసు దోచుకుని ఇన్ని పురస్కారాలు గెలుచుకున్న ఈ చిత్రం దళపతి విజయ్ నటించిన ఓ తమిళ చిత్రానికి కాపీ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న హంగామా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పారా సైట్ చిత్రానికి `మిన్సర కన్న` అనే చిత్రం స్ఫూర్తి అని విజయ్ అభిమానులు హడావుడి చేస్తున్నారు. ఈ రెండు సినిమాల కథలకు సారూప్యత ఉందనేది ఫ్యాన్స్ చెబుతున్న మాట. అంతేకాదు.. పారా సైట్ - మిన్సర కన్న చిత్రాల కథల మధ్య పోలికల్ని అభిమానులు చెబుతున్నారు.

`మిన్సర కన్న` కథాంశం చాలా సింపుల్ గా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ వ్యాపారవేత్త (ఖుష్బు) ఇంట్లో వాద్యకారుడిగా పనిచేసే ధనవంతుడైన యువకుడి (విజయ్) చుట్టూ కథ తిరుగుతుంది. టైమ్ చూసి ఆ కుర్రాడు తనవారిని వ్యాపారవేత్త ఇంట్లో ఉద్యోగానికి నియమించుకుంటాడు. అయితే ఇదంతా తన ప్రేమను గెలిపించుకునేందుకు అతడు చేసే ప్రయత్నం. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యావరేజ్ ఫలితం అందుకుంది. ఇక ఆస్కార్ విజేతగా నిలిచిన పారాసైట్ కథను పరిశీలిస్తే థీమ్ లైన్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ఓ పేద కుటుంబం మారు పేర్లతో ఓ ధనిక కుటుంబంలోకి ప్రవేశించి ఆ కుటుంబాన్ని బంధించేస్తుంది. అందుకే ఆ రెండు కథాంశాలకు పోలిక పెట్టేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆస్కార్ లు ప్రకటించిన అనంతరం దర్శకుడు కె.ఎస్.రవికుమార్ పనితనాన్ని దళపతి ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు.

1999లో రిలీజైన తమిళ చిత్రం `మిన్సర కన్న` అప్పట్లో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. విజయ్ - మోనికా ఈ చిత్రంలో నాయకానాయికలు. రంభ- ఖుష్బు- కరణ్- మన్నివన్నన్- మన్సూర్ అలీ ఖాన్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవా సంగీతం సమకూర్చారు జ. కె.ఆర్ గంగాధరన్ నిర్మించారు.