సూపర్ హిట్ సీక్వెల్ లో ఆమెకు స్థానం లేదా..?

Thu Jun 17 2021 08:00:01 GMT+0530 (IST)

Papanasanam Team Searching For Gauthami Replacement In The Sequel

మలయాళ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన 'దృశ్యం' సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో రీమేక్ కాబడి మంచి విజయం సాధించింది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలలో అనుకోని సంఘటన కారణంగా కష్టాలు ఎదురైతే.. ఆ కుటుంబ పెద్ద తన వారిని ఎలా కాపాడుకున్నాడు అనే కథాంశం ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తమిళంలో కమల్ హాసన్ - గౌతమి ప్రధాన పాత్రలతో “పాపనాశం” అనే పేరుతో తెరకెక్కించారు. అయితే ఇప్పుడు తమిళంలో ఈ చిత్రానికి సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ''దృశ్యం 2'' సినిమా ఇటీవల డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదలై సక్సెస్ అయింది. ఫస్ట్ పార్ట్ కథ ఎక్కడ ముగిసిందో అక్కడే కథను మొదలుపెట్టి.. అదే నటీనటులు సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ - మీనా లతో రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ''పాపనాశం-2″ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సీక్వెల్ లో ఫిమేల్ లీడ్ పోషించిన గౌతమీ భాగం కాకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.

'పాపనాశం' సినిమా చేసినప్పుడు కమల్ - గౌతమి ఇద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే కొన్ని సమస్యల కారణంగా వీరిద్దరూ 2016లో విడిపోయారు. అందుకే ఈ సీక్వెల్ లో గౌతమి ఉండకపోవచ్చని అంటున్నారు. ఆమె స్థానంలో ఒరిజినల్ వెర్షన్ లో నటించిన మీనా పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారని టాక్. జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే కమల్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తో 'విక్రమ్' సినిమా చేస్తున్నాడు. శంకర్ తో చేయాల్సిన 'ఇండియన్ 2' వివాదాల్లో ఉంది. ఈ నేపథ్యంలో 'పాపనాశం 2' చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి.