Begin typing your search above and press return to search.

'గాలి సంపత్' నుంచి జాయ్ ఫుల్ రొమాంటిక్ 'పాప ఓ పాప' సాంగ్..!

By:  Tupaki Desk   |   5 March 2021 6:36 AM GMT
గాలి సంపత్ నుంచి జాయ్ ఫుల్ రొమాంటిక్ పాప ఓ పాప సాంగ్..!
X
టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు - న‌ట‌కిరీటి రాజేంద్ర ‌ప్ర‌సాద్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ''గాలి సంపత్". బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రాన్ని అనీష్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ మరియు ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది - ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన 'ఫిఫీఫీ ఫిఫిఫీ' సాంగ్ మరియు రాజమౌళి వదిలిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా 'పాప ఓ పాప' అనే వీడియో సాంగ్ ని హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేశారు.

'పాప ఓ పాప.. నీ పేరు తలచి నేను మజునునయ్యానే.. పాప ఓ పాప నా పేరు మరిచి నేను పిచ్చోన్నయ్యానే' అంటూ సాగిన ఈ పాటకు అచ్చు రాజమణి ట్యూన్ అందించారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. బెన్నీ దాయల్ - బెన్ హ్యూమన్ - అనుదీప్ దేవ్ కలిసి ఆలపించారు. ఈ సాంగ్ అందమైన బీచ్ లొకేషన్స్ లో శ్రీవిష్ణు - హీరోయిన్ ల‌వ్‌ లీ సింగ్ లపై ఈ సాంగ్ ని చిత్రీకరించారు. శ్రీవిష్ణు వేసిన సింపుల్ డ్యాన్స్ సస్టెప్స్ అలరిస్తున్నాయి. ఈఈ చిత్రానికి సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎస్‌. క్రిష్ణ‌ స్టోరీ అందించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించారు. మిర్చి కిర‌ణ్ సంభాషణలు రాశారు.