పాన్ ఇండియా సినిమా.. బుకింగ్స్ నిల్..!

Fri Mar 17 2023 10:45:33 GMT+0530 (India Standard Time)

Pan India movie.. Nil bookings..!

కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల తర్వాత కన్నడ చిత్రసీమ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. అద్భుతమైన రీతిలో కథ చెప్పడంలో నైపుణ్యం కల్గిన పరిశ్రమగా పేరుగాంచింది. కానీ కేజీఎఫ్2 తర్వాత మరే సినిమా ఆ రేంజ్ లో రాలేకపోవడంతో.. మళ్లీ పాత రోజుల్లోకి వెళ్ళిపోయింది కన్నడ సినీ రంగం. కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవలే హీరోగా నటించిన చిత్రం క్రాంతి. ఈ సినిమా జనవరి 26వ విడుదలై అనేక భాషల్లోకి డబ్ చేయబడింది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. 20 కోట్ల షేర్ ని కూడా వసూలు చేయలేకపోయింది.విలక్షణ నటుడు కన్నడ మెగా సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా వస్తున్న మూవీ కబ్జా. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన శ్రియా శరణ్ సుదీప్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంటీబీ నాగరాజ్ సమర్పణలో శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్న కబ్జా సినిమా ఈరోజే రిలీజ్ అవుతోంది. అయితే కన్నడ ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. కానీ వారి ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కేజీఎఫ్ తరహాలో ఉందని చాలా మంది కామెంట్లు చేశారు. ఇతర భాషల్లోనే కాకుండా కన్నడలో కూడా బుకింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. పాన్ ఇండియా మల్టీ స్టారర్ గా అంచనా వేసినప్పటికీ... ఎవరిలోనూ అంత ఇంట్రెస్ట్ ను కల్గించలేకపోయింది. ఓవర్సీస్ లో కబ్జా సినిమా కథ కేడీఎం సమయానికి డెలివరీ కాలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే యూఎస్ ప్రీమియర్ లు గందరగోళానికి గురయ్యాయి. భారతదేశంలో మొదటి షో ప్రారంభమయ్యే సమయానికి యూఎస్ లో కొన్ని షోలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో సినిమాకు ఎలాంటి నెగిటివ్ టాక్ రాకూడదనే ఉద్దేశంతోనే సినీ బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థం అవుతోంది. ముంబయిలో కొందరు ముందస్తుగానే హిందీ వెర్షన్ కు రివ్యూలు రాశారు. అవేం పాజిటివ్ గా లేవు. మరి చూడాలి ఈ సినిమా ఎవరిని ఎలా ఆకట్టుకోనుందో టాక్ ఎలా ఉండనుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.