`జాతిరత్నాలు` చిత్రానికి పాన్ ఇండియా అప్పీల్ తెచ్చాడా?

Sat Mar 06 2021 15:00:01 GMT+0530 (IST)

Pan India appeals to Jaathi Ratnalu?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారతదేశంలోనే ఫైనెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. అతడి సినిమాలకు ఇటు సౌత్ అటు నార్త్ రెండు చోట్లా జేజేలు పలుకుతున్నారు. అలాంటి అసాధారణ పాపులారిటీ ఉన్న స్టార్ ఓ సినిమాకి పబ్లిసిటీ చేస్తే ఎలా ఉంటుందో తాజాగా `జాతిరత్నాలు` ట్రైలర్ లాంచ్ ప్రూవ్ చేస్తోంది.ఈ సినిమా ట్రైలర్ ని ప్రభాస్ లాంచ్ చేసిన క్షణాలు నిమిషాల్లో అంతర్జాలంలో వేగంగా వైరల్ అయ్యింది. టాలీవుడ్ టాప్ మోస్ట్ వ్యూస్  లైక్స్ కలిగిన ట్రైలర్స్ జాబితాలో జాతిరత్నాలు చేరింది అంటే..అర్థం చేసుకోవాలి. దానికి కారణం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టార్ లాంచ్ చేయడమేనని విశ్లేషిస్తున్నారు. యంగ్ హీరోలు నవీన్..రాహుల్ రామకృష్ణ ప్రియదర్శిలకు ఇది పెద్ద బూస్ట్. నవతరం దర్శకుడు అనుదీప్ కేవీ కి ఇది పెద్ద ప్లస్ అనే చెప్పాలి.

ఇక ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీకి సన్నాహకాల్లో ఉన్న నాగ్ అశ్విన్ స్వయంగా జాతిరత్నాలు సినిమాని నిర్మిస్తుండడంతో ప్రభాస్ తనకు అన్నివిధాలా సాయం అవుతున్నారు. అన్నట్టు జాతిరత్నాలు కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే రిలీజవుతోందా..? అంటే దానికి నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.