ట్రెండీ టాక్: టీవీ నటీమణుల నాభి సొగసు హిందోళం

Fri Jan 27 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

Palak Tiwari Photo Talk

ఇటీవల బుల్లితెర పెద్ద తెర అనే విభేధాలేవీ కనిపించడం లేదు. గ్లామర్ ని ఒలికించేందుకు టీవీ నటీమణి వెండితెర నటీమణి అంటూ డివైడ్ చేయలేని సన్నివేశం సోషల్ మీడియా డిజిటల్ యుగంలో కనిపిస్తోంది. ఎవరికి వారే వయ్యారి భామలుగా హొయలు పోవడం ఎక్కువైంది. వరుసగా ఘాటైన ఫోటోషూట్లు వీడియో షూట్లతో ఇన్ స్టా మాధ్యమంలో యూట్యూబ్ లో విరుచుకుపడుతూ కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తున్నారు.



ఇది బికినీ షో లేదా స్విమ్ సూట్ షో కాదు కానీ.. ఇలా వయ్యారంగా నాభి సొగసును ఆవిష్కరిస్తూ అలా పలకలు తిరిగిన యాబ్స్ ని ప్రదర్శిస్తూ సెల్ఫీలకు ఫోజులివ్వడం నయా ట్రెండ్ గా మారింది. బుల్లితెర వెండితెర నటీమణులుగా పాపులర్ అవుతున్న పలువురు భామలు ఇలా స్పెషల్ సెల్ఫీలు ఫోటోషూట్లతో చెలరేగుతున్నారు.

ఇప్పటికే రకరకాల వివాదాలు రూమర్లతో సుపరిచితులైన పాలక్ తివారీ- నియా శర్మ- మౌని రాయ్ సహా ఇతర టీవీ మూవీ నటీమణులు నాభి సౌందర్యాన్ని ఆవిష్కరించేందుకు రాక్ హార్డ్ అబ్స్ ని ప్రదర్శించేందుకు అస్సలు మొహమాటానికి పోవడం లేదు. తమ ఫిట్ నెస్ స్టైల్ చూడండి అంటూ.. అభిమానులకు గోల్స్ ఫిక్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.

నవతరం కథానాయిక పాలక్ తివారీ త్వరలో సల్మాన్ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. పలువురు బాలీవుడ్ స్టార్ కిడ్స్ తో పాలక్ ఎంతో సన్నిహితంగా ఉంటుంది. పాలక్ తివారీకి రాక్ హార్డ్ యాబ్స్ ఉన్నాయనడానికి తాజా ఫోటోగ్రాఫ్ నిదర్శనం. ఆమె రెగ్యులర్ గా జిమ్ చేస్తుంది. ఫ్యాన్సీ డైట్ లపై తనకు నమ్మకం లేదని చెబుతున్నా పరిమితాహారంతో యాబ్స్ ని సాధించానని చెబుతోంది. ఇంట్లో వండిన సాధారణ ఆహారం తింటూనే ఇది సాధ్యమని కూడా చెప్పింది. పాలక్ మాత్రమే కాదు. వాష్ బోర్డ్ యాబ్స్ ఫిట్నెస్ గోల్స్ లో దూసుకెళుతున్న టీవీ బ్యూటీలు చాలా మంది ఉన్నారు.

సీనియర్ నటి నియా శర్మ లేట్ ఏజ్ లోను సెగలు పుట్టిస్తున్న తీరు నిరంతరం చర్చకు వస్తుంటుంది. ఈ భామ ఫిట్ నెస్ ను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇన్నేళ్లుగా తాను చీట్ చేసి ఏది పడితే అది తినలేదని పరిమిత భోజనంతో ఫిట్ నెస్ ని కాపాడుకున్నానని ఈ భామ చెప్పింది. ఝలక్ దిఖలాజా 10 తర్వాత మునుపటి కంటే మరింత టోన్ డ్ లుక్ తో కనిపిస్తోంది. యాబ్స్ తేవడానికి గతంలో చాలా శ్రమించానని ఈ భామ చెబుతోంది.

నాగిని ఫేం మౌని రాయ్ ఇటీవల గ్లామర్ ఎలివేషన్ తో చెలరేగుతోంది. గోల్డ్ సినిమాతో అక్షయ్ సరసన పెద్ద తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ఇమేజ్ అంతకంతకు పెరుగుతోంది. ఈ భామకు జిమ్మింగ్- స్విమ్మింగ్- పైలేట్స్ - డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మౌని కూడా శాకాహారి. ఒక ఒలింపియన్ తరహా శరీరాకృతి టోన్డ్ యాబ్స్ తో మైమరిపిస్తోంది.

నిక్కీ తంబోలి ఇటీవల ఎక్కువగా పాపులరవుతున్న పేరు. లారెన్స్ మాస్టార్ కాంచన 3 - చీకటిగదిలో చితక్కొట్టుడు సినిమాలతో తెలుగువారికి ఈ భామ సుపరిచితం. పరిశ్రమలో అత్యుత్తమ శరీరాకృతి కలిగి ఉన్న బ్యూటీగా తనకు గుర్తింపు ఉంది.  నిక్కీ నిరంతరం చాలా సమయం వెచ్చించి జిమ్ చేస్తుంది. ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే అనుసరిస్తుంది. తన పలకల దేహాకృతిని కాపాడుకునేందుకు ఎంతో చేస్తోందిట.

ఎరికా ఫెర్నాండెజ్ గతంలో తెలుగు సినిమాల్లోను నటించింది. తమిళంలో ఫేమస్ అయింది. ఎరికా కు యోగాపై గట్టి నమ్మకం. ఆమె పైలేట్స్ కూడా చేస్తుంది. ఈ భామకు బరువు సంబంధిత సమస్యలు ఉన్నాయి. కానీ శరీరాకృతిని కాపాడుకునేందుకు ఎంతో శ్రమిస్తోంది.

బుల్లితెర వెండితెర నటి.. బిగ్ బాస్ ఫేం హీనా ఖాన్ ఫిట్ నెస్ ఫ్రీక్. TRX నుండి ఏరియల్ యోగా వరకు ట్యాలెంటెడ్ బ్యూటీ అన్నింటినీ చాలా సునాయాసంగా చేసేస్తుంది. హీనా ఖాన్ ఉలితో చెక్కిన యాబ్స్ నేటితరానికి నిజమైన ప్రేరణ.

సృతి ఝా.. ఈ టీవీ నటి తరచుగా తన మిడ్ రిఫ్(నాభి)ను ప్రదర్శించే దుస్తులను ధరించకపోయినా కానీ.. ఝా వాష్ బోర్డ్ యాబ్స్ ను కలిగి ఉంది. సాహస క్రీడల (అడ్వెంచర్ స్పోర్ట్స్) నుండి ఫైర్ డ్యాన్స్ వరకు  శారీరకంగా ఈ భామ చాలా శ్రమపడుతుంది. సన్నజాజి శరీరంతో అందంతో కవ్వించే ఈ బ్యూటీ మునుముందు పెద్ద తెరపైనా దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది.  అదే క్రమంలో ఫోటోషూట్ల పరంగా ఇకపై ఘాటైన లుక్స్ తో విరుచుకుపడనుందిట. ఇటీవల టీవీ రంగంలోని పలువురు నటీమణులతో పాటు యాంకర్లు కూడా ఫిట్ నెస్ తో అలరిస్తున్నారు. మేకోవర్ కోసం జిమ్ముల్లో నిరంతరం శ్రమిస్తూ ఫిట్నెస్ ఫ్రీక్స్ గా పేరు తెచ్చుకుంటున్నారు. దీనికి హిందీ పరిశ్రమతో పాటు టాలీవుడ్- తెలుగు బుల్లితెర తారలు అతీతం కాదు.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.