ఆహా పక్కా కమర్షియల్ సినిమా వచ్చేసిందోచ్..!

Fri Aug 05 2022 15:00:01 GMT+0530 (IST)

'Aha' 'Pakka commercial' film has come To OTT audience

గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా ను అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించడం జరిగింది. సినిమా ను థియేటర్ లో చూడని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేశారు.ఎట్టకేలకు ఆహా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు పక్కా కమర్షియల్ సినిమా వచ్చేసింది. నేటి నుండి ఆహా లో పక్కా కమర్షియల్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకులు ఇప్పటికే ఆహా లో పక్కా కమర్షియల్ ను స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ప్రేక్షకులు కూడా పక్కా కమర్షియల్ సినిమా ను స్ట్రీమింగ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

గోపీచంద్ ను లాయర్ గా చూపించిన దర్శకుడు మారుతి సినిమా లో కావాల్సినంత ఎంటర్ టైన్‌మెంట్ ను అందించాడు. ఏదో కారణం వల్ల థియేటర్ రిలీజ్ అయ్యి భారీ వసూళ్లను రాబట్టలేక పోయినా కూడా ఓటీటీ ద్వారా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

అనుకున్నట్లుగానే ఆహా లో సినిమా ను స్ట్రీమింగ్ చేసేందుకు ఎక్కువ శాతం ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ పక్కా కమర్షియల్ సినిమా కు యూవీ క్రియేషన్స్ వారు కూడా సహ నిర్మాతలుగా వ్యవహరించిన విషయం తెల్సిందే. వెండి తెరపై మ్యాజిక్ చేయడంలో విఫలం అయిన పక్కా కమర్షియల్ ఓటీటీ స్ట్రీమింగ్ తో సందడి చేస్తోంది.

ఈ సినిమాలో రాశి ఖన్నా పాత్ర తో పాటు హీరో గోపీచంద్ పాత్ర కూడా ఎంటర్ టైన్‌మెంట్ ను అందించింది. ఇంకా ఈ సినిమా లో సత్య రాజ్.. రావు రమేష్.. సుభలేక సుధాకర్.. సప్తగిరి ఇంకా అజయ్ ఘోష్ లు ముఖ్య పాత్రల్లో కనిపించారు. మారుతి మార్క్ ఎంటర్ టైన్‌మెంట్ మూవీ అయిన పక్కా కమర్షియల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మొదలవ్వడంతో సోషల్ మీడియాలో సందడి మొదలయ్యింది.