ఈ బాయ్కాట్ గ్యాంగ్ సౌండ్ పొల్యూషన్ మాత్రమే

Tue Feb 07 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Pakash Raj Comments on Boycott Gang

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతున్న నేపథ్యంలో బాయ్కాట్ గ్యాంగ్ ఎక్కడ అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించాడు. సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుండే సినిమాను బ్యాన్ చేయాలి.. బాయ్కాట్ చేయాలి అంటూ హడావుడి చేసిన వారు కూడా పఠాన్ ను చూశారు అంటూ ప్రకాష్ రాజ్ ఎద్దేవ చేశాడు.తాజాగా ప్రకాష్ రాజ్ మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2023 చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా ప్రకాష్ రాజ్ బాయ్ కాట్ బ్యాచ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

హిందుత్వం పేరు చెప్పి సినిమా ఇండస్ట్రీ పై విమర్శలు చేస్తున్న వారిని మరియు సినిమాలను బహిష్కరిస్తున్న వారిని ప్రకాష్ రాజ్ తీవ్రంగా దుయ్యబట్టాడు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.... ఈ బాయ్ కాట్ గ్యాంగ్ పఠాన్ ను నిషేదించాలని కోరింది. కానీ సినిమా 700 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అదే బాయ్ కాట్ గ్యాంగ్ పీఎం మోడీ గురించి ఆయన రాజకీయ జీవితం గురించి సినిమాను తెరకెక్కించిన సమయంలో థియేటర్ కు వెళ్లలేదు. కనీసం ఆ సినిమా 30 కోట్ల వసూళ్లు సాధించలేక పోయింది.

ఈ బాయ్ కాట్ బ్యాచ్ యొక్క హడావుడి కేవలం సౌండ్ పొల్యూషన్ మినహా మరేమి లేదని.. ఇకపై అయినా వారు నోరు మూసుకుని ఉండాలంటూ ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా ది కశ్మీర్ ఫైల్స్ సినిమాని ప్రకాష్ రాజ్ నాన్ సెన్స్ మూవీ అంటూ పేర్కొన్నాడు.

ఇండియన్ మీడియాను పబ్లిసిటీ పేరుతో మోసం చేయవచ్చు కానీ అంతర్జాతీయ మీడియాను మోసం చేసి అవార్డును రాబట్టుకోలేరు అంటూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మరియు ఇతర ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ వారి పై తీవ్ర పదజాలంతో ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.