షారుఖ్ ట్రైలర్ పై పాక్ ఆర్మీ చిందులు!

Sat Aug 24 2019 20:24:52 GMT+0530 (IST)

Pak Army chief spokesperson Asif Ghafoor lambasts SRK over Netflix espionage drama Bard of Blood

ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ విషయంలో తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై పాకిస్తాన్ ఏడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రద్దు వల్ల భారత్ తో వాణిజ్య సంబంధాలని కూడా తెంచుకుని - తమ దేశంలో బాలీవుడ్ సినిమాలు ఆడకూడదని పాకిస్థాన్ నిర్ణయం కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ పై పాకిస్థాన్ ఆర్మీ వెదవ ఏడుపులు ఏడుస్తోంది.నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ తాజాగా విడుదలైన ట్రైలర్ పై పాక్ ఆర్మీ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చిందులు తొకుతున్నారు. ఈ ట్రైలర్ పై గఫూర్ ట్విటర్ లో స్పందిస్తూ..షారూఖ్ పై విమర్శలు గుప్పించారు.  తమరు ఇంకా బాలీవుడ్ భ్రమలోనే బతుకుతున్నారని - రియాలిటీ తెలియాలంటే ‘రా’ గూఢాచారి కుల్ భూషణ్ జాదవ్ - వింగ్ కమాండర్ అభినందన్ - 27 ఫిబ్రవరి 2019న భారత్-పాకిస్తాన్ సరిహద్దు వివాదాన్ని గమనించండని సూచించాడు.

అలాగే తమరు జమ్మూ కశ్మీర్ లో జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా గళమెత్తి.. శాంతిని ప్రోత్సహించాలని - నాజీలుగా మారిన హిందుత్వ ఆరెస్సెస్ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే బాగుంటుందని పేర్కొన్నారు. కాగా గూఢచర్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ వెబ్ సిరీస్ బిలాల్ సిద్దిఖీ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ఇమ్రాన్ హష్మీ - వినీత్ కుమార్ సింగ్ - శోభితా ధూళిపాల (గూఢాచారి ఫేమ్) ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు.

అటు తమ వెబ్ సిరీస్ ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని - గూఢచర్యం - ప్రతీకారం - ప్రేమ - విధి నిర్వహణల మధ్య సాగే ఓ ఉత్కంఠభరితమైన కథ అని చెబుతూ.. షారుఖ్ ఈ ట్రైలర్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. పాకిస్థాన్ బలూచీస్థాన్ లో మొదలయ్యే ఈ ట్రైలర్ వీక్షకులని బాగా ఆకట్టుకుంటుంది.