కుస్తీ వీరుడి అవతారంలో మెప్పిస్తున్న కిచ్చ

Wed Jan 16 2019 22:37:47 GMT+0530 (IST)

Pailwaan Kusthi Teaser

కన్నడలో స్టార్ హీరో అయిన కిచ్చ సుదీప్ 'ఈగ' 'బాహుబలి' లాంటి సినిమాలలో నటించడంతో సౌత్ అంతా గుర్తింపు తెచ్చుకున్నాడు.  సుదీప్ ప్రస్తుతం 'పైల్వాన్' అనే సినిమాలో నటిస్తున్నాడు.  'దంగల్' లో అమీర్ ఖాన్.. 'సుల్తాన్' లో సల్మాన్ ఖాన్ లాగా 'పైల్వాన్' లో సుదీప్ కుస్తీ వీరుడిగా నటిస్తున్నాడు. ఈమధ్యే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలయింది.టీజర్ లో అసలు సిసలు మల్లయోధుడిగా చొక్కా లేకుండా ఒక చిన్న లంగోటి నడుముకు కట్టుకొని చేత్తో మట్టి తీసుకుని పోటీకి సై అంటున్నాడు.  పోటీలో ఉన్న మరో కుస్తీవీరుడిని మట్టికరిపించాడు.   ఈ టీజర్ లో అందరినీ ఆకర్షించేది సుదీప్ ఫిట్నెస్.. అయన చొక్కాలేని అవతారం.  నలభైల్లో ఈ ఫిట్నెస్ ను చూసి సుదీప్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాధారణ నెటిజనులు మాత్రమే కాదు.. ఏకంగా సల్మాన్ ఖానే సుదీప్ ను మెచ్చుకున్నాడు.  తన ట్విట్టర్ ద్వారా 'పైల్వాన్' టీజర్ ను షేర్ చేసి మరీ సుదీప్ ను అభినందించాడు. సల్మాన్ నెక్స్ట్ ఫిలిం 'దబాంగ్ 3' లో సుదీప్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడనే సంగతి తెలిసిందే. అందుకే సల్మాన్ సుదీప్ పై ప్రత్యేక అభిమానం చూపించాడు.

'పైల్వాన్' కన్నడ భాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.  సుదీప్ తో 'హెబ్బులి' అనే సినిమాను తెరకెక్కించిన కృష్ణ ఈ 'పైల్వాన్' కు దర్శకుడు.