Begin typing your search above and press return to search.

'పచ్చీస్' సాంగ్: రాజ్యాలే మునిగేటి రంగుల 'జూదం'

By:  Tupaki Desk   |   3 Jun 2021 6:30 AM GMT
పచ్చీస్ సాంగ్: రాజ్యాలే మునిగేటి రంగుల జూదం
X
టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు కోలీవుడ్ లో కూడా ఎంతో మందికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన రామ్స్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా ''పచ్చీస్''. ఇందులో శ్వేతావర్మ హీరోయిన్ గా నటిస్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ‌కృష్ణ‌ & రమా సాయి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 'కింగ్' అక్కినేని నాగార్జున ఆవిష్కరించిన ఫ‌స్ట్ లుక్‌ - విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని 'జూదం' అనే సాంగ్ లిరికల్ వీడియోని యువ హీరో అడవి శేష్ విడుదల చేశారు.

'ముక్కల డెక్కుల్లో ఎక్కడి విడ్డూరం.. సోమరి సోదరుల సోకే ఈ జూదం.. రంగు కాగితాలే రంగులు మార్చే భాగోతం..' అంటూ సాగిన ఈ పాట పేకాట వంటి జూదాలకు బానిసలైన వారి గురించి తెలియజేస్తోంది. దీనికి స్మరన్ సాయి ట్యూన్ కంపోజ్ చేయడమే కాకుండా తనదైన శైలిలో ఆలపించారు. 'రాజ్యాలే మునిగేటి రంగుల జూదం.. దర్జాగా దిగజారే రాజులు సైతం' అంటూ నిక్లేష్ సుంకోజి సాహిత్యం అందించారు. కార్తీక్ పరమర్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి.. రానా ప్రతాప్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

అవాసా చిత్రం మరియు రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి - రమా సాయి సంయుక్తంగా ''పచ్చీస్'' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయ చంద్ర - రవి వర్మ - శుభలేఖ సుధాకర్ - దయానంద్ రెడ్డి - కేశవ్ దీపక్ తదితరులు నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.