Begin typing your search above and press return to search.

‘PSPK28’ టైటిల్ - ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడేనా..?

By:  Tupaki Desk   |   10 Jun 2021 7:30 AM GMT
‘PSPK28’ టైటిల్ - ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడేనా..?
X
పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ - హరీష్ కాంబోలో రానున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే టైటిల్ - ‘PSPK28’ ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్స్ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఉగాది రోజున ఫస్ట్‌ లుక్‌ మరియు టైటిల్‌ ను విడుదల చేయాలనుకున్నామని.. కానీ కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశామని మేకర్స్ ప్రకటించారు. దీంతో టైటిల్ ఖరారు చేయడమే కాకుండా.. ఆల్రెడీ ఫస్ట్ లుక్ డిజైన్ కూడా రెడీగా ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. అంతేకాదు అవి ఎలా ఉండబోతున్నాయంటూ ఇంతకముందు కంటే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి మరింత ఎక్కువైంది. అయితే ఈ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే సెప్టెంబర్ 2న లేదా స్వాతంత్ర్య దినోత్సవం నాడు రివీల్ చేసే అవకాశం ఉందని చెప్పాలి.

‘PSPK28’ కాన్సెప్ట్ పోస్టర్ తో ఈసారి ఎంటర్టైన్మెంట్ తోపాటుగా సోషల్ మెసేజ్ కూడా ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇండియా గేట్ బ్యాగ్రౌండ్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ - సుభాష్ చంద్రబోస్ ఫోటోలు చూపిస్తూ.. ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష - గులాబీ పువ్వును పెట్టి ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. దీనిని బట్టి పవన్ తరహా దేశ భక్తి షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ లెక్కన పవన్ బర్త్ డే నాడు ఒక అప్డేట్.. ఆగస్ట్ 15న మరో అప్డేట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి పవర్ స్టార్ టీమ్ ఏ ముహార్తాన్ని ఫిక్స్ చేస్తారో చూడాలి.