Begin typing your search above and press return to search.

#PSPK27 తొడ‌కొట్టి మ‌ల్ల‌యోధుల్ని మ‌ట్టిక‌రిపిస్తాడ‌ట‌

By:  Tupaki Desk   |   7 March 2021 2:30 AM GMT
#PSPK27 తొడ‌కొట్టి మ‌ల్ల‌యోధుల్ని మ‌ట్టిక‌రిపిస్తాడ‌ట‌
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న వ‌కీల్ సాబ్ ఈ స‌మ్మ‌ర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ప్ర‌మోష‌న్ లో వేగం పెంచేందుకు దిల్ రాజు -శ్రీ‌రామ్ ఆదిత్య బృందం ప్ర‌ణాళిక‌ల్లో ఉంది. ఇంత‌కుముందే రిలీజైన‌ `సత్యమేవ జయతే..` పాట ప‌వ‌న్ అభిమానుల్లోకి దూసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట అభిమానుల్లో జోష్ పెంచింది. థ‌మన్ స్వరపరిచిన బాణీతో పాటు రామజోగయ్య శాస్త్రి రచించిన సాహిత్యం ఆక‌ట్టుకున్నాయి.

అయితే వ‌కీల్ సాబ్ ని మించి క్రిష్ తో హిస్టారిక‌ల్ మూవీ #PSPK27 పై బ‌జ్ క‌నిపిస్తోంది. అస‌లు ప‌వ‌న్ ఇందులో ఎలా క‌నిపించ‌బోతున్నారు? అతిడి పాత్ర‌ను క్రిష్ ఏ రేంజులో ఎలివేట్ చేయ‌బోతున్నారు? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు ఇందులో మ‌ల్ల యోధుల్ని సైతం మ‌ట్టి క‌రిపించే వీరుడిగా ప‌వ‌న్ క‌నిపించ‌బోతున్నార‌ని తెలిసింది.

అంతేకాదు అత‌డు యోధుల ముందు తొడ‌గొట్టి స‌వాల్ విసిరే స‌న్నివేశం గూస్ బంప్స్ తెచ్చేస్తుంద‌ట థియేట‌ర్ల‌లో. ప‌వ‌న్ అభిమానుల‌కు ఇది గొప్ప ట్రీట్ అవుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాడీ బిల్డ‌ర్ ని ఎత్తి అవ‌త‌ల వేసేంత మొన‌గాడైన‌ రెజ్ల‌ర్ గా ప‌వ‌న్ బాడీ లాంగ్వేజ్ ని లుక్ ని మార్చి చూపిస్తున్నార‌ట‌. దానికోసం ప‌వ‌న్ చాలా శ్ర‌మించార‌ని లుక్ ని మార్చుకున్నార‌ని చెబుతున్నారు.

ప‌వ‌న్ ని ఇంతవరకు ఇలాంటి సన్నివేశాల్లో ఫ్యాన్స్ ఎన్న‌డూ చూడలేదు. థియేటర్ కి వెళ్ళినప్పుడు అభిమానులు ఈ అద్భుతమైన సన్నివేశం కోసం వేచి ఉంటారన‌డంలో సందేహ‌మేం లేదు. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రాని( #PSPK27 )కి వీర‌మ‌ల్లు.. హరి హర వీరమల్లు అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నిధి అగర్వాల్- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మ‌ల్ల యోధుల‌తో ఇంత‌కుముందు ప‌వ‌న్ పోరాట స‌న్నివేశాల్ని చిత్రీక‌రించిన సంగ‌తి తెలిసిన‌దే.