Begin typing your search above and press return to search.

#PSPK27 మ‌హాశివ‌రాత్రి కానుక లేన‌ట్టేనా? --

By:  Tupaki Desk   |   6 March 2021 2:30 PM GMT
#PSPK27 మ‌హాశివ‌రాత్రి కానుక లేన‌ట్టేనా? --
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్ లోని హిస్టారిక‌ల్ మూవీ #PSPK27 పై రోజుకో గాసిప్ పుట్టుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫ‌స్ట్ గ్లిమ్స్ టైటిల్ లాంచ్ మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం చిత్ర‌బృందం నుంచి రాలేదు. ఇవ‌న్నీ కేవ‌లం ఊహలు క‌ల్పితాలు మాత్ర‌మేన‌ని టీమ్ అంటోంద‌ట‌. అంటే మ‌హాశివ‌రాత్రికి PSPK27 టైటిల్ ప్ర‌క‌ట‌న ఉంటుందా లేదా? అన్న‌దానిపై ఇంకా ప‌వ‌న్ -క్రిష్ టీమ్ లో క్లారిటీ లేద‌నే భావించాల్సి ఉంటుంది.

ఈ క్రేజీ హిస్టారిక‌ల్ చిత్రం కోహినూర్ వ‌జ్రం చుట్టూ క‌ల్పిత క‌థ‌తో రూపొందుతోంద‌ని.. ఇందులో ప‌వ‌న్ రాబిన్ హుడ్ త‌ర‌హా తిరుగుబాటు దారుడిగా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. స‌ముద్ర దొంగ‌గానూ అత‌డి పాత్ర ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని ఇంత‌కుముందు లీకులు అందాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ నాయిక‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఎం రత్నం నిర్మిస్తున్నారు. సంక్రాంతి 2022 కి రిలీజ్ చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.