Begin typing your search above and press return to search.

PS 2: మరో మెలోడీ సాంగ్ ఆగనందే.. బ్యూటీఫుల్

By:  Tupaki Desk   |   21 March 2023 12:43 PM GMT
PS 2: మరో మెలోడీ సాంగ్ ఆగనందే.. బ్యూటీఫుల్
X
ప్రముఖ భారతీయ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ ఏ రేంజ్ లో హిట్టు అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించగా.. మొదటి భాగాన్ని గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేశారు. అయితే ఈ సినిమా రెండో భాగాన్ని ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను ఈరోజు విడుదల చేశారు.

ముందుగా చిత్రబృందం ప్రకటించినట్ల ఈ రోజు ఆగనందే పాటను విడుదల చేశారు. ఆగనందే అంటూ సాగే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ఈ పాటకు స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిచారు.

అనంతర శ్రీరామ్ ఈ పాటను రాయగా.. వినసొంపుగా శక్తిశ్రీ గోపాలన్ పాటను ఆలపించారు. పాట విన్న ప్రతీ ఒక్కరూ చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మొదటి పార్టులో ఉన్న పాటల కంటే కూడా ఈ పాట మరింత బాగుందని చెబుతున్నారు.

అయితే ఎప్పటి నుంచో పొన్నియన్ సెల్వన్ 2ను ప్రేక్షకుల ముందుకు తేవాలని మణిరత్నం చూస్తుండగా... ఒకటి రెండు సార్లు ప్రయత్నాలు చేసినా అది కుదరలేదట. అయితే ఇన్నేళ్లకు ఆ కల నెరవేరింది. అయితే ఈ సినిమాను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. కానీ ఈ పాట అదిరిపోవడంతో.. ఎవరైనా ముందుకు అవకాశం ఉన్నట్లు అంతా భావిస్తున్నారు.

ఈ సినిమా రెండు భాగాలను దాదాపు 500 కోట్ల రూపాయలతో ఒకేసారి చిత్రీకరించారు. అయితే మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు ఒక్క తమిళంలోనే 200 కోట్లకు పైగా రాబట్టింది.

తమిళనాడులో 200 కోట్ల రూపాయలు సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం తమిళ నేటివిటీతోనే తెరకెక్కించడంతో అక్కడ మాత్రం భారీ వసూళ్లు సాధించింది. మరి రెండో పార్ట్ ఏ రేంజ్ లో వసూలు చేయనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.