పవన్ రానాల మూవీలో సీనియర్ నటుడు కీలక పాత్ర

Tue May 04 2021 11:00:51 GMT+0530 (IST)

PK Rana Ayyappanum Koshiyum Remake

మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రీమేక్ ను పవన్ మరియు రానాలు కలిసి చేయడమే ఇందుకు కారణం. పవన్ కళ్యాణ్ మరియు రానాలు మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో సాగే సినిమా ఇది. పవన్ చాలా ఆసక్తితో ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తూ ఉండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమా లో కీలక పాత్రను సీనియర్ నటుడు బ్రహ్మాజీ తో చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.పవన్ పలు సినిమా ల్లో బ్రహ్మాజీ కనిపించాడు. ఇక త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో కూడా బ్రహ్మాజీ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేస్తాడనే టాక్ ఉంది. ఇప్పుడు ఈ రీమేక్ లో కూడా బ్రహ్మాజీకి కీలకమైన పాత్రను ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రానా కారు డ్రైవర్ పాత్రలో బ్రహ్మాజీ కనిపించబోతున్నాడట. సినిమా లో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ టైమ్ తక్కువే అయినా కూడా ఒక నోటెడ్ పాత్రను మాత్రం ఆయన చేస్తున్నాడట.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే సినిమా షూటింగ్ ను సగం వరకు పూర్తి చేశాడని తెలుస్తోంది. కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి విశ్రాంతిలో ఉంటున్నాడు. త్వరలోనే మళ్లీ ఆయన షూటింగ్ కు హాజరు అవుతారనే వార్తలు వస్తున్నాయి. ఆయన మొదట ఈ రీమేక్ ను పూర్తి చేసి ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పవన్ మరో 20 నుండి 25 వర్కింగ్ డేస్ మాత్రమే ఈ రీమేక్ కు కేటాయించాల్సి ఉందట. ఇక ఈసినిమా లో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.