దసరాకు పీకే 'ఏకే' రీమేక్..?

Mon May 03 2021 23:00:01 GMT+0530 (IST)

PK 'AK' remake for Dasara ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'వకీల్ సాబ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. 'పింక్' రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ ఇమేజ్ కి తగ్గట్టు తెలుగు వెర్షన్ లో మార్పులు చేసి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు రానా దగ్గుబాటి తో కలిసి ఓ మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు పవన్. మలయాళ 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిపేశారు.అయితే 'వకీల్ సాబ్' చిత్రానికి అనూహ్యమైన స్పందన లభించడంతో పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తనకు అచ్చొచ్చిన రీమేక్ పాలసీని తన తదుపరి సినిమాకి కూడా అప్లై చేయాలని చూస్తున్నారు. ఈ ఉగాదికి 'పింక్' రీమేక్ తో సక్సెస్ అందుకున్న పీకే.. ఇప్పుడు 'ఏకే' రీమేక్ ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. మలయాళ కథలో తెలుగు నేటివిటీకి సెన్సిబిలిటీస్ తగ్గట్లు పలు మార్పులు చేసి '#PSPKRana' చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. పవన్ ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ని యాడ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

'#PSPKRana' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.