అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సేవాగుణం చాటుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబూటర్స్ ..

Sun Nov 28 2021 14:00:07 GMT+0530 (IST)

Overseas Distributors Expressing Service at the Akhanda Pre Release Event

మోస్ట్ అవేటడ్ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య అభిమానులు ఓవర్సీస్ డిస్ట్రబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచారు. *ఓరర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు పరిశ్రమలో చిర పరిచుతలైన వెంకట్ ఉప్పుటూరి గోపీచంద్ ఇన్నమూరి గారు రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి* నుండి ఐదు లక్షల రూపాయల చెక్ ని బాలాకృష్ణ గారికి అందజేసారు. *టాలీమూవీస్ మోహాన్ కమ్మ* రెండు లక్షలు *కెనెడా తెలుగు మూవీస్ సుమంత్ సుంకర* గారు ఒక లక్ష రూపాయులు మొత్తం *ఎనిమిది లక్షలు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ కి* డోనేషన్ గా అందించారు.అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఈ క్యార్యక్రమం అందరి మన్ననలు పొందింది. ఓవర్సీస్ 500 థియేటర్స్ లో విడుదలవుతున్న అఖండ పై భారీ అంచనాలున్నాయి. బిగ్గెస్ట్ రిలీజ్ అవుతున్న అఖండ మూవీ తెలుగు సినిమా కి పూర్య వైభవం తెస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ఛైర్మన్ గా బాలకృష్ణ అందిస్తున్న సేవాకార్యక్రమాలు అండగా నిలిచిన వీరి సేవాగుణం అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న అఖండ బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధిస్తుందని విశ్లేషకులంటున్నారు.