ఆస్కార్ వెబ్ సైట్ లో మన తెలుగు పాట

Tue Jan 31 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Our Telugu song on Oscar website

ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేషన్ అయిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో నాటు నాటు పాట నిలిచింది. హాలీవుడ్ లో బాగా పాపులరైన పాటల సరసన ఈ సాంగ్ నిలిచింది. ఇంత వరకు ఏ తెలుగు సాంగ్ ఇంత వరకు ఆస్కార్ నామినేషన్ కు వెళ్లలేదు. నాటు నాటు పాటకు కీరవాణి ఆస్కార్ గెలిస్తే.. ఏఆర్ రెహమాన్ తర్వాత భారత్ కు రెండో ఆస్కార్ తీసుకొచ్చిన సంగీత దర్శకుడిగా కీరవాణి నిలుస్తారు.స్లమ్ డాగ్ మిలియనీర్ అనే చిత్రంలోని జయహో సాంగ్ కు రెహమాన్ కు ఆస్కార్ లభించింది. అయితే ఈ సారి ఆస్కార్ నామినేషన్ లో కీరవాణి తో పాటు హాలీవుడ్ హేమాహేమీలు పోటీలో ఉన్నారు. వారందరినీ వెనక్కి నెడితేనే కీరవాణికి ఆస్కార్ దక్కేది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుతో పాటు మరో నాలుగు పాటలు పోటీ పడుతున్నాయి. అందులో టెల్ ఇట్ లైక్ ఏ విమెన్ నుండి 'అప్లాజ్' టాప్ గన్ మావెరిక్ నుండి 'హోల్డ్ మై హ్యాండ్' బ్లాక్ ఫాంథర్: వకండా ఫరెవర్ నుండి 'లిఫ్ట్ మి అప్' ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ నుండి 'దిస్ ఇజ్ ఏ లైఫ్' పాటలు నాటు నాటు సాంగ్ తో పాటు ఆస్కార్ బరిలో నిల్చున్నాయి.

హోల్ట్ మై హ్యాండ్ సాంగ్ ను వరల్డ్ టాప్ పాప్ సింగర్ లేడీ గాగా ఆలపించింది. 8 నెలల క్రితం వచ్చిన ఈ సాంగ్ కు యూట్యూబ్ లో 145 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లిఫ్ట్ మి అప్ పాటను బార్బేరియన్ సింగర్ రిహన్నా పాడింది. 3 నెలల క్రితం వచ్చిన ఈ సాంగ్ కు యూట్యూబ్ లో ఇప్పటి వరకు 77 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అప్లాజ్ సాంగ్ ను డేన్ వారెన్ పాడారు.

ఈ సాంగ్ 2 నెలల క్రితం యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఇప్పటి వరకు 527K వ్యూస్ వచ్చాయి. దిస్ ఇజ్ ఏ లైఫ్ పాటకు ర్యాన్ లాట్ మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో 10 నెలల క్రితం అప్లోడ్ చేయగా ఇప్పటి వరకు 580K వ్యూస్ వచ్చాయి. నాటు నాటు సాంగ్ ను 9 నెలల క్రితం యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఇప్పటి వరకు 117 మిలియన్ వ్యూస్ వచ్చాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.