నెట్ ఫ్లిక్స్ లో మన శ్యామ్ వరల్డ్ నెం.3

Thu Jan 27 2022 09:31:33 GMT+0530 (IST)

Our Shyam World No 3 on Netflix

నాని హీరోగా సాయి పల్లవి మరియు కృతి శెట్టి హీరోయిన్స్ గా రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందిన శ్యామ్ సింగ రాయ్ సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్యామ్ సింగ రాయ్ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ దక్కించుకుంది. థియేటర్ రిలీజ్ అయిన తర్వాత శ్యామ్ సింగ రాయ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కు ఏ స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యాయో.. అంతే స్థాయిలో నెట్ ఫ్లిక్స్ లో కూడా వ్యూస్ దక్కాయి. అత్యధికంగా వ్యూయింగ్ అవర్స్ ను దక్కించుకున్న శ్యామ్ సింగ రాయ్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కి దక్కని అరుదైన రికార్డును నాని శ్యామ్ సింగ రాయ్ దక్కించుకుంది.శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమింగ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే దాదాపుగా 3.6 లక్షల వ్యూయింగ్ అవర్స్ ను దక్కించుకుంది. ఆ వారంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల్లో టాప్ 10 లో ఒకే ఒక్క ఇండియన్ మూవీ నిలిచింది. ఇప్పటి వరకు ఏ ఒక్క సౌత్ ఇండియన్ మూవీకి దక్కని అరుదైన రికార్డును శ్యామ్ సింగ రాయ్ దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమింగ్ అయిన ఆ వారంలో టాప్ 3 లో నిలిచింది. అది కూగా ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ వినియోగదారుల పరంగా చూసుకుంటే టాప్ 3 లో నిలిచింది. కేవలం ఇండియాలో అయితే నెం.1 అయ్యి ఉంటుంది.

నాని మరియు సాయి పల్లవిల కాంబో హిట్ పెయిర్ గా గుర్తింపు దక్కించుకున్నారు. అందుకే వారిద్దరి కలయిక సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉంది. దానికి తోడు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించడం.. కథ పూర్వ జన్మల నేపథ్యం అవ్వడం వల్ల శ్యామ్ సింగ రాయ్ సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా థియేటర్ రిలీజ్ లో ఘన విజయం సాధించింది. అంతే కాకుండా ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుని టాప్ లో నిలిచింది.