300 లాంటి క్లాసిక్ వార్ యాక్షన్ డ్రామా వీక్షించిన అభిమానులు ఆ సినిమా కథానాయకుడు గెరార్డ్ బట్లర్ ని అంత తేలిగ్గా మర్చిపోలేరు. 300 మంది యోధులతో అరాచకులైన శత్రుసైన్యంపైకి దూసుకెళ్లే వీరాధి వీరుడిగా యుద్ధ నిపుణుడిగా అలుపెరగని వేటగాడిగా గెరార్డ్ బట్లర్ నటన అసమానం. ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన చిత్రమిది.
480 B.C. కింగ్ జక్షిస్ (రోడ్రిగో శాంటోరో) నేతృత్వంలోని పర్షియా .. గ్రీస్ పైకి దండయాత్రకు వెళుతుంది. థర్మోపైలే యుద్ధంలో గ్రీకు నగర రాష్ట్రమైన స్పార్టా రాజు లియోనిడాస్ (గెరార్డ్ బట్లర్) అరాచకులైన పెర్షియన్ సైన్యానికి వ్యతిరేకంగా తన 300 మంది యోధులను నడిపించాడు. స్పార్టాన్ ల కోసం పోరాటంలో మరణం తప్పదని తెలిసినా యుద్ధం కోసం తమ ప్రజల కోసం వారి త్యాగం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. స్పార్టన్ల పోరాట ప్రయత్నం తమ దాయాదులు సైతం కలిసి వచ్చేలా.. మొత్తం ఉమ్మడి శత్రువులకు వ్యతిరేకంగా ఏకం కావడానికి ప్రేరేపిస్తుంది.
థర్మోపైలే యుద్ధంలో కింగ్ లియోనిడాస్ తో కలిసి 300 మంది స్పార్టాన్లు జక్షిస్ సైన్యంపై దండయాత్ర చేస్తారు. స్పార్టన్ తిరస్కరించిన వీరుడే మోసం చేయడంతో జక్షిస్ రాజుకు స్పార్టన్లు చిక్కి విరోచిత పోరాటంలో మరణిస్తారు. అంతవరకూ అజేయంగా యుద్ధంలో గెలుస్తూ ముందుకు సాగుతారు. 2007 మార్చి 9న ఈ సినిమా విడుదలైంది. జాక్ స్నైడర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుద్ధ వీరుల అసమాన నటన.. దానికి ధీటుగా స్పార్టన్ కింగ్ గా గెరార్డ్ బట్లర్ మహదాద్భుత నటనాభినయం కట్టి పడేస్తాయి. 6.5 కోట్ల USD బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఆస్కార్ లు సహా పలు అవార్డులు రివార్డులు కొల్లగొట్టిన చిత్రమిది.
అయితే 300 ఆ తర్వాత చాలా సినిమాల మేకింగ్ విధానాన్ని ప్రేరేపించింది. నిజానికి ఎస్.ఎస్.రాజమౌళి ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసినా కానీ 300 నుంచి ఎంతో ప్రేరణ పొందారు. అదే క్రమంలో ఆ స్ఫూర్తితో అతడు బాహుబలి లాంటి అసాధారణ చిత్రానికి శ్రీకారం చుట్టారు. బాహుబలి సంచలన విజయం తర్వాత టాలీవుడ్ అజేయమైన జైత్రయాత్ర గురించి హిస్టరీ చెప్పాల్సిన పని లేదు.
అయితే ఇటీవలే ఆర్.ఆర్.ఆర్ తో మరో సంచలనం సృష్టించిన రాజమౌళి తదుపరి మహేష్ తో పాన్ ఇండియా సినిమాకి సిద్ధమవుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో నాటు నాటు గీతం గోల్డెన్ గ్లోబ్ అందుకుని ఆస్కార్ బరిలో నిలిచిన వేళ ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంలో నటించిన రామారావు- రాజమౌళి- రామ్ చరణ్- కీరవాణి తదితర టీమ్ ఆస్కార్ మెరుపుల కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అదే క్రమంలో ఈ ఈవెంట్ కే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు. అతడు ఉత్తమ నటుడి (విదేశీ) కేటగిరీలో భారతదేశం తరపున అవార్డు కొల్లగొడతాడని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ 14 కేటగిరీల్లో నామినీలకు ప్రయత్నిస్తోంది. తుది ఎంపికలో జూరీ ఏం చేస్తుందో చూడాలని అంతా వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉండగా తారక్ ఏ హాలీవుడ్ నటుడిని పోలి ఉంటాడు? అంటే 300 హీరో గెరార్డ్ బట్లర్ తో పోలి ఉంటాడని అభిమానులు విశ్లేషిస్తున్నారు. తారక్ సీరియస్ లుక్.. యారొగెన్సీని బట్టి చూస్తే 300 యోధుడినే తలపిస్తాడు. అతడి క్రోధం ఆహార్యం గెరార్డ్ బట్లర్ ని తలపిస్తాయనడంలో సందేహం లేదు. చిరునవ్వుల రారాజుగా కనిపిస్తే అతడి అంత స్మార్ట్ ఇంకెవరుంటారు? నిజానికి 300 సీక్వెల్ అనంతరం మరో ప్రయత్నం సాగలేదు. ఒకవేళ అలాంటి ప్రయత్నం సాగితే గనుక బట్లర్-జాక్ స్నైడర్ బృందం తారక్ పేరును పరిశీలిస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.