తెలుగు ప్రేక్షకుల కోసం ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న సినిమా

Sat Apr 01 2023 07:00:01 GMT+0530 (India Standard Time)

Oscar Award winning movie for Telugu audience The Whale Movie

ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ది వేల్ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేక్షకులు గూగల్ లో సెర్చ్ చేశారు.. ఈ సినిమా ఎక్కడ ఉంది.. ఎలా ఉంది అంటూ చాలా మంది గూగుల్ చేయడం జరిగింది. ఇండియన్ సినీ ప్రేక్షకులకు సోనీ లివ్ గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని ఇండియన్ భాషల్లో ఈసినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది.బ్రెండన్ ఫ్రేజర్ కీలక పాత్రలో నటించిన ది వేల్ చిత్రం మొన్నటి ఆస్కార్ అవార్డ్ వేడుకల్లో రెండు అవార్డులను గెలుచుకున్న విషయం తెల్సిందే. ఆస్కార్ గెలిచినప్పటి నుండి కూడా ఈ సినిమాను చూడాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు ముందుకు వచ్చాయి.

ఇంగ్లీష్ తో పాటు తెలుగు.. తమిళం.. హిందీ ఇంకా ఇతర భాషల్లో కూడా ది వేల్ చిత్రం స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది.

సోనీ లివ్ కు ఇండియాలో ఖాతాదారులు తక్కువే ఉన్నారు. అయితే తాజాగా ది వేల్ కారణంగా సోనీ లివ్ యొక్క ఖాతాదారులు భారీగా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

డారెన్ అరోనోఫ్స్కీ దర్శకత్వంలో రూపొందిన ది వేల్ విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది వేల్ ఆస్కార్ దక్కించుకున్న తర్వాత ఎక్కువ మంది చూస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి తన కథనంలో పేర్కొనడం జరిగింది.

ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన నేపథ్యంలో చాలా మంది ఆ పాటను ఇప్పుడు వింటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.