కీర్తి టాలెంట్ ని గుర్తించండి బాబులు..!

Fri Mar 31 2023 22:00:01 GMT+0530 (India Standard Time)

Original Talent Keerthy Suresh In Dasara Movie

మలయాళ భామ కీర్తి సురేష్ సరైన సినిమా పడితే తన సత్తా ఏంటన్నది చూపిస్తుంది. గొప్ప నటి కాబట్టే మహానటితో ప్రేక్షకుల హృదయాలతో పాటుగా నేషనల్ అవార్డు సైతం దక్కించుకుంది. అయితే మహానటి తర్వాత కీర్తి సురేష్ చిన్ని సినిమాతో మరోసారి తన నటనతో మెప్పించినా అది ఓటీటీ రిలీజ్ అవడంతో అంత ప్రచారం జరగలేదు.ఇక మరోపక్క కమర్షియల్ సినిమాలో ఆమెను కేవలం గ్లామర్ సైడ్ మాత్రమే చూపించారు. మహానటి లాంటి పాత్ర మళ్లీ దొరకడం కష్టమే కానీ దొరికిన పాత్రలో తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యింది కీర్తి సురేష్.

అలాంటి టైం లోనే వచ్చిన ఆఫర్ దసరా. ఈ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటించడం అన్నది అది నాని స్పెషల్ ఛాయిస్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ రాసుకున్న పాత్రకి ఆమె నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది.

వెన్నెల పాత్రలో తన నటనతో మరోసారి మార్కులు కొట్టేసింది కీర్తి సురేష్. సినిమాలో ఆమె బరాత్ లో డాన్స్ చేసిన తీరు చాలు ఆమె ఎంత కమిటెడ్ అన్నది చెప్పడానికి.. దసరా సినిమాతో మరోసారి తన అభినయ తారగా జిగేల్ అనిపించింది కీర్తి సురేష్.

దసరా సినిమా చూశాక కీర్తి సురేష్ లోని ఇంత టాలెంట్ ని సరిగా వాడుకోవట్లేదని అనుకోక తప్పదు. దర్శక నిర్మాతలకు కీర్తి లోని ఒరిజినల్ టాలెంట్ ని గుర్తించండి బాసు అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏది ఏమైనా కీర్తి సురేష్ మరోసారి సూపర్ అనిపించుకుంది. మొన్నటిదాకా స్కిన్ షో చేయదు అనుకున్న అమ్మడు కాస్త ఫోటో షూట్స్ తోనే రెచ్చిపోతుంది. అయితే ఏది ఎలా ఉన్నా సౌత్ సినీ పరిశ్రమకు కీర్తి సురేష్ ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు.

అయితే ఆమెకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలి.. ఆమె కోసం ఎలాంటి పాత్రలు రాయాలి అన్నది చూసుకోవాలి. తనకు సూటయ్యే ఎలాంటి పాత్ర అయినా సరే అభినయంతో అదరగొట్టడం లో కీర్తి సురేష్ ఎక్కడ తగ్గదు. దసరాతో ఆ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.