Begin typing your search above and press return to search.

కార్తికేయ 2తో అసలైన హ్యాపీడేస్.. కెరీర్ బిగ్ హిట్

By:  Tupaki Desk   |   17 Aug 2022 7:30 AM GMT
కార్తికేయ 2తో అసలైన హ్యాపీడేస్.. కెరీర్ బిగ్ హిట్
X
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా మరొక మెట్టుకు ఎదగాలని ప్రయత్నిస్తున్న హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. జయం సినిమాలో చిన్నప్పటి గోపీచంద్ పాత్రలో అద్భుతమైన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసి ఆ తర్వాత సహాయక దర్శకుడిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మొత్తంగా తనకి హ్యాపీ డేస్ సినిమా తో ఒక మంచి బ్రేక్ అయితే వచ్చింది.. కానీ ఆ తర్వాత టైర్ 2 హీరో కిందకి కూడా అతను రాలేకపోయాడు.

విభిన్నమైన కథాంశాలను టాలెంటెడ్ ఉన్న దర్శకులను సెలెక్ట్ చేసుకుంటున్న నిఖిల్ అసలైన సక్సెస్ ని మాత్రం కార్తికేయ 2 సినిమాతో 2014లో అందుకున్నాడు.

అప్పటివరకు అతని కెరీర్లో అదే అతిపెద్ద సినిమా.ఆ తర్వాత అంతకుముందు వచ్చిన సినిమాలు మంచి స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా అతనికి మరో రేంజ్ తీసుకు వెళ్లలేదు.

ఇక మళ్ళీ చాలా కాలానికి ఎక్కడికి పోతావు చిన్నవాడ మాత్రం 16 కోట్ల షేర్ తో అతని స్థాయిని పెంచింది. ఇక మళ్ళీ పడుతూ లేస్తూ వచ్చిన నిఖిల్ ఇన్నాళ్లకు కార్తికేయ 2 తో బిగెస్ట్ హిట్ కొట్టాడు. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది.

నిఖిల్ కెరీర్ లో మొదట స్వామి రారా అనే సినిమా 7కోట్లకు పైగా షేర్ అందుకొని అతని మార్కెట్ను పెంచింది. ఇక ఆ తరువాత 2014లో వచ్చిన కార్తికేయ 2 సినిమా అదే రేంజ్ లో సక్సెస్ అయ్యింది. కిర్రాక్ పార్టీ కూడా అదే తరహా లో 7 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంది. కానీ ఆ సినిమాకు బడ్జెట్ ఎక్కువ కావడం వలన కొంత నష్టాలు అయితే ఎదుర్కోవాల్సివచ్చింది.

కేశవ, అర్జున సురవరం సినిమాలు 9 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకొని నిఖిల్ మార్కెట్ ను కొంత పెంచాయి. అయితే 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' సినిమా అనంతరం అత్యధికంగా కార్తికేయ 2 సినిమా కేవలం 4 రోజుల్లోనే 15 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకొని కెరీర్లోనే అతిపెద్ద సినిమాగా నిలిచింది. చూస్తూ ఉంటే కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంది. మరి మొత్తంగా నిఖిల్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.