Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : కామెడీతో ఆకట్టుకుంటున్న 'ఒరేయ్ బుజ్జిగా'

By:  Tupaki Desk   |   28 Sep 2020 11:10 AM GMT
ట్రైలర్ టాక్ : కామెడీతో ఆకట్టుకుంటున్న ఒరేయ్ బుజ్జిగా
X
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఆహాలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ని యువసామ్రాట్ నాగచైతన్య విడుదల చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. 'నాదొక బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ' అని హీరో చెప్పే డైలాగ్ తో సినిమాపై ఆసక్తి కలుగుతోంది. 'ప్రపంచంలో ప్రతి మగ వెధవా నా ప్రైవసీని డిస్టర్బ్ చేసేవాడే..' 'మీకు రిలేషన్ షిప్ లో ఉన్నన్ని రోజులు బాయ్ ఫ్రెండ్ లక్స్ సోప్ లాంటోడే.. ఒళ్ళంతా రాసేసుకుంటారు.. బ్రేకప్ అయిన తర్వాత డెటాల్ సోప్ లాంటోడని చేతులు కడుక్కోడానికి మాత్రమే వాడతారు' 'ఇదేంటి వీడు టీడీపీని ఆర్జీవీ తగులుకున్నట్లు తగులుకున్నాడు' వంటి డైలాగ్స్ సినిమాలో కావాల్సినంత కామెడీ ఉందని తెలియజేస్తున్నాయి. మొత్తం మీద ట్రైలర్ ఆధ్యంతం కామిడీ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

కాగా, 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రానికి 'గుండజారి గల్లంతయ్యిందే' 'ఒక లైలా కోసం' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వచించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. ఈ సినిమాలో మాళవిక అయ్యర్ - హెబ్బా పటేల్ లు హీరోయిన్స్ గా నటించారు. వాణీ విశ్వనాథ్‌ - సీనియర్ నరేష్‌ - పోసాని కృష్ణమురళి - అనీష్‌ కురువిళ్ళ - సప్తగిరి - రాజారవీంద్ర - అజయ్‌ ఘోష్‌ - సత్యం రాజేష్ - సత్య ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఐ. ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు. అక్టోబర్ 2న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న 'ఒరేయ్ బుజ్జిగా' ఓటీటీ ఆడియన్స్ ని ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.