మెగాహీరో చేతులమీదుగా కురిసెన.. కురిసెనా..!

Sat Feb 22 2020 10:10:06 GMT+0530 (IST)

Orey Bujjiga Movie First Single Kurisena Kurisena Will Be Released On 21st Feb 9:30 AM By Varun Tej

రాజ్ తరుణ్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ప్రమోషన్ వీడియోస్ తర్వాత సినిమా నుండి మొదటి పాటను కూడా విడుదల చేశారు. ఈ పాటను మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేయడం విశేషం.మెగా హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో ఈ పాట లింక్ ను షేర్ చేయడం జరిగింది. పాట వరుణ్ కు నచ్చి విడుదల చేసేందుకు ఒప్పుకున్నారంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కురిసెన.. కురిసెనా.. అంటూ మెలోడిగా సాగే ఈ పాటను అనూప్ రూబెన్స్ ట్యూన్ చేశాడు. ఇక శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడట. రాజ్ తరుణ్.. మాళవిక నాయర్ లపై రొమాంటిక్ గా ఈ పాట చిత్రీకరించినట్లుగా విజువల్స్ చూస్తుంటే అనిపిస్తుంది.

పాట గురించి నిర్మాత మాట్లాడుతూ.. మెగా హీరో వరుణ్ మా పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటతో పాటు సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు. ఈ సినిమాపై రాజ్ తరుణ్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. రాజ్ తరుణ్ మరియు మాళవిక నాయర్ ల కాంబో లవ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రాజ్ తరుణ్ సక్సెస్ కొడతాననే నమ్మకంతో కనిపిస్తున్నాడు.