బాలయ్య #110 గా ఆ రెండింటిలో ఒకటి ఫిక్స్ చేయాలి!

Mon Nov 28 2022 10:18:49 GMT+0530 (India Standard Time)

One of those two should be fixed as Balayya #110!

నటసింహ బాలకృష్ణ  # 110వ సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 107వ సినిమా 'వీరసింహారెడ్డి' సంక్రాంతి కానుగా రిలీజ్ అవుతుంది. అటుపై 108వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో రెడీ అవుతుంది. 109వ ప్రాజెక్ట్ సంగతి  పక్కన బెడితే 110వ సినిమాపై అప్పుడే ఆసక్తి మొదలైంది. ఎలాంటి సినిమాతో రాబోతు్నారు? ఏ దర్శకుడ్నిలాక్ చేస్తున్నారు? వంటి  అంశాలు అభిమానుల్లో ఉత్కంఠకు తెర తీస్తున్నాయి.ఇప్పటికే 'ఆదిత్య 369' కీ సీక్వెల్ గా 'ఆదిత్య 999' కథని స్వయంగా బాలయ్యే సిద్దం చేసారు. మరి ఆయనే దర్శకత్వం వహిస్తారా? ఇంకేవరికైనా   ఆ బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది  క్లారిటీ లేదు. కానీ ఈ ప్రాజెక్ట్  110వ సినిమా రేసులో ఉంది. అలాగే  'అఖండ' బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యం సహా బోయపాటిపై నమ్మకంతో ఆల్యాండ్ మార్క్ మూవీ బాధ్యతలు అతనికి అప్పగించడానికి అవకాశం ఉందని బలంగా వినిపిస్తుంది.

'అఖండ-2' కథ కూడా సిద్దమైందని బాలయ్య గోవా  అంతర్జాతీయ ఫిల్మ్స్ పెస్టవల్స్ లో రివీల్ చేసారు. సీక్వెల్ ఎప్పుడు తెరకెక్కిస్తామన్నది తెలియదుగానీ కచ్చితంగా  ప్రాజెక్ట్ అయితే ఉంటుందని క్లారిటీ ఇచ్చేసారు.  ఈ నేపథ్యంలో ఈ  రెండు సినిమాల్లో ఏదో ఒకటి 110వ సినిమాగా అవ్వడానికి ఛాన్స్ ఉందని బలంగా వినిపిస్తుంది.

బాలయ్య-బోయపాటి కాంబోకి తిరుగులేదు. ఇప్పటికే హ్యాట్రిక్ అందుకున్నారు. డబుల్ హ్యాట్రిక్  పై కన్నేసారు అన్న ప్రచారం ఉండనే ఉంది. కాబట్టి ఆ ఛాన్స్ బోయపాటి తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే బాలయ్య ఆదిత్య 999 కథ కోసం ఏకంగా తానే కలం పట్టారు. అవసరమైతే  కెప్టెన్ కుర్చి ఎక్కడానికి కూడా  వెనుకాడరు.

అదే జరిగితే ఆ సినిమాని ప్రతష్టాత్మకంగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఆ నెంబర్ 110 అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. మరోవైపు కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' కథ రెడీగా ఉంది. బాలయ్య  గ్రీన్ సిగ్నెల్  ఇస్తే వచ్చి వాలిపోతారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కాలి.

అమితాబచ్చన్ రేంజ్ ఉన్న హీరో ఈ కథలో  ఓపాత్రకి అవసరం కావడంతో  ఇంత కాలం వాయిదా పడింది. అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ ని కూడా 110వ సినిమా బరిలో దించినా షాక్ అవ్వాల్సిన పనిలేదు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.