ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. మనోడు ఏం చేసినా.. అది నేషనల్ వైడ్ న్యూస్ అయిపోతోంది. బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే పట్టాలెక్కిస్తున్న రెబల్ స్టార్.. ఇప్పుడు ఏకంగా నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రకటించినంత వేగంగా వాటిని ఫినిష్ చేస్తున్నాడు ప్రభాస్. కాగా.. లేటెస్ట్ గా బయటకు వచ్చిన ప్రభాస్ పిక్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
త్వరలో రాబోతున్న ప్రభాస్ మూవీ
‘రాధేశ్యామ్’. ఇది ప్రభాస్ కు 20వ చిత్రం. ఈ మూవీని శరవేగంగా విడుదలకు
సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్
ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా చివరకు వచ్చేసింది. ఇప్పటికే టీజర్ గ్లింప్స్
కూడా వదిలారు మేకర్స్. త్వరలో మెయిన్ టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక
సినిమాను జూలై 31న ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు.
‘రాధేశ్యామ్’
తరువాత బెర్త్ కన్ఫాం చేసుకున్న మూవీ ‘సలార్’. KGFతో ఆలిండియా స్టార్
డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ
సినిమా మొదలవడంతో పాటు మొదటి షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. వచ్చే
ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలబెట్టాలని ట్రై చేస్తోంది యూనిట్.
వీటి
తర్వాత లైన్లో ఉన్న మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. రామాయణం
ఆధారంగా తెరకెక్కబోతున్న ఆ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న
విషయం తెలిసిందే. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్
దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తిగా VFX సపోర్ట్
తో ఆ మూవీ షూట్ కంప్లీట్ చేయనున్నారు.
కాగా.. ప్రభాస్ లేటెస్ట్ లుక్
ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కోర మీసాలతో ఉన్నాడు
రెబల్ స్టార్. బాడీ లాంగ్వేజ్ కూడా కాస్త ఛేంజ్ అయినట్టు కనిపిస్తోంది.
అయితే.. ప్రధానంగా ఈ ఫొటోలోని మీసకట్టు చూసి.. ఇది రాముడి గెటప్ అయి
ఉంటుందని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. ఈ లుక్ ఖచ్చితరం ఆదిపురుష్ లోనిదే
అయి ఉంటుందని అంటున్నారు. మరి వాస్తవం ఏంటోగానీ.. ప్రస్తుతానికి ఈ చిత్రం
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.