ఆ మూడు లక్షణాలు ప్రభాస్ కి 'ఆదిపురుష్' ని చేశాయి

Thu Sep 29 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

Om Raut comments on prabhas

ఒక దర్శకుడు ప్రాణం పెట్టి కథను రాసుకుంటాడు.. ఆ కథలోని ప్రతి పాత్రకు కూడా ప్రాణం పోసే విధంగా నటీ నటులు కావాలని కోరుకుంటారు. అన్ని పాత్రలకు కాకున్నా ముఖ్యమైన నాలుగు అయిదు పాత్రలకు అయినా ది బెస్ట్.. అతడు తప్ప మరెవ్వరు సాధ్యం కాదు.. వర్కౌట్ అవ్వదు అన్నట్లుగా ఉండాలని దర్శకులు ఎంపిక చేసుకుంటారు. అలా దర్శకుడు ఓమ్ రౌత్ కి అనిపించిన తర్వాతే ఆదిపురుష్ సినిమాకు ప్రభాస్ ని ఎంపిక చేసుకున్నాడట.బాలీవుడ్ లో ప్రభాస్ నటిస్తున్న మొదటి సినిమా ఆదిపురుష్. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ గ్రాఫిక్స్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు. అందులో భాగంగానే దసరా సందర్భంగా సినిమా యొక్క టీజర్ ఆవిష్కరణ జరుగబోతుంది.

బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు.. ప్రభాస్ ని మించిన ఫిజిక్... ప్రభాస్ కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారు ఉన్నారు. అయినా కూడా ఎందుకు ప్రభాస్ ని ఆదిపురుష్ లోని రాముడి పాత్రకు తీసుకున్నారు అంటే ఆదిపురుష్ ఎవరికైనా చెప్పే సమాధానం ఒక్కటే అంటూ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.

అదేంటీ... అంటే తాను రాసుకున్న రాముడి పాత్రకు మూడు గుణాలు ఉంటాయి. సహనం.. రాజసం.. హుందాతనం. ఈ మూడు గుణాలు ఎవరిలో ఉంటాయా అని నేను చూసిన సమయంలో ప్రభాస్ లో ఈ మూడు గుణాలు తక్కువ ఎక్కువ అన్నట్లుగా కాకుండా పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన నా రాముడు అయ్యాడు అంటూ సమాధానం చెబుతున్నాడు.

ఒక సినిమాకు కమిట్ అయితే ప్రాణం పెట్టేంత సహనం ఆయనకు ఉంది. రాజుల కుటుంబంలో జన్మించిన వ్యక్తి కనుక సాదారణంగానే ప్రభాస్ లో ఒక రాజసం కనిపిస్తుంది. ఇక హుందాతనంలో ప్రభాస్ ని మించిన వారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపించక పోవచ్చు.

ఎలాంటి వారి వద్దనైనా హుందాగా ప్రవర్తించే వ్యక్తి ప్రభాస్. అందుకే ఈ మూడు కారణాల వల్ల ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ ని తీసుకున్నారట. ఇలాంటి పాత్రలు చేయడానికి అదృష్టం కలిసి రావాలి. ప్రభాస్ కి ఆ అదృష్టం కలిసి వచ్చి అద్భుతమైన ఆదిపురుష్ లో నటించే అవకాశం వచ్చిందని ఇటీవల ఆయన సన్నిహితుడు ప్రభాస్ శ్రీను వ్యాఖ్యలు చేశాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.