శర్వా 'ఒకే ఒక జీవితం'.. మరో అద్భుతమైన సాంగ్

Tue Aug 16 2022 17:48:50 GMT+0530 (India Standard Time)

Okate Kadhaa Lyric

యువ కథానాయకుడు శర్వానంద్ 30వ చిత్రం ఓకే ఒక జీవితం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లో ఎస్ ఆర్ ప్రకాష్ బాబు ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.  మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా ఒకటే కదా సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. లైఫ్ గురించి ఎంతో అర్థవంతంగా ఉన్న సాహిత్యంలో ఈ పాట ఓ వర్గం వారిని ఆకట్టుకుంటోంది.కథానాయకుడు తన జీవితం గురించి పాటలోనే చెప్పినట్లు అనిపిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ అర్థవంతమైన సాహిత్యాన్ని రాశారు.  

గౌతమ్ భరద్వాజ్ గాత్రం కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమా టీజర్ కి ఇదివరకే అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా అమ్మ పాట అన్ని వర్గాల వారికి నచ్చింది. ఇక ఇప్పుడు జీవితంపై అర్థవంతంగా ఒకటే కదా పాటను రిలీజ్ చేశారు. ఇది కూడా సినిమాపై ఒక మంచి నమ్మకాన్ని ఏర్పరుస్తోంది.

సినిమా విషయానికి వస్తే.. ఓకే ఒక జీవితం సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించబడింది. ఇక సినిమాలో VFX సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని టాక్. ఈ చిత్రంలో అమల అక్కినేని శర్వానంద్ తల్లి పాత్రలో నటించగా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ వర్క్ చేస్తుండగా శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ అందిస్తున్నారు. మంచి టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాయడం విశేషం. ఒకేసారి తమిళ్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఒకే ఒక జీవితం సినిమాను తమిళంలో 'కణం' పేరుతో విడుదల కానుంది.  ఈ సినిమా విడుదలకు సంబంధించి మరిన్ని సర్ ప్రైజ్ ప్రకటనలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక శర్వానంద్ కూడా ఒకే ఒక జీవితం మూవిపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గత సినిమాలు అతనికి కొంత నిరాశపరిచినప్పటికి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. సాంగ్స్ టీజర్ మొత్తానికి సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాయి. ఇక సినిమా కూడా అదే తరహాలో మెప్పించడం కాయమని అంటున్నారు. మరి శర్వానంద్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.