వరంగల్ లో జరగబోతున్న ఆ వేడుకలో పవన్

Wed Mar 29 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Official announcement that Pawan Kalyan to attend Warangal event

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక వైపు కమిట్ అయిన అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో పాల్గొంటూనే మరో వైపు జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ నాయకులతో మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలపై దృష్టి పెట్టడం గొప్ప విషయం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయం.. మరో వైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ప్రైవేట్ కార్యక్రమాల్లో.. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. త్వరలో వరంగల్ లో జరగబోతున్న ఒక కార్యక్రమంలో హాజరు అయ్యేందుకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఏప్రిల్ 6 2023న సాయంత్రం 6 గంటలకు వరంగల్ లోని ఎన్ ఐ టీ లో ప్రసిద్ధ సాంస్కృతిక ఉత్సవం స్పింగ్ స్ప్రీ జరగబోతుంది.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ను హాజరు అయ్యేందుకు ఆహ్వానించగా పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

పవన్ హాజరు కాబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు విద్యార్థులు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ ప్రారంభించి సగానికి పైగా పూర్తి చేశారు. మరో వైపు వినోదయ సీతమ్ సినిమా రీమేక్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. వచ్చే నెలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పవన్ నటించబోతున్నాడు. మరో వైపు ఓజీ సినిమా కూడా మొదలు పెట్టబోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.