అఫిషియల్ : వెంకీ 75 'హిట్' కాంబో ఫిక్స్

Mon Jan 23 2023 13:28:47 GMT+0530 (India Standard Time)

Official: Venky 75 'Hit' Combo Fix

వెంకటేష్ మైల్ స్టోన్ మూవీ 75వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఎఫ్ 3 సినిమా తర్వాత వెంకటేష్ నుండి రాబోతున్న సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ వారు అధికారికంగా వెంకటేష్ 75వ సినిమాను తాము నిర్మించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.వెంకటేష్ 75వ సినిమా ఇది అంటూ కూడా నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ వారు అధికారికంగా ప్రకటించడంతో పాటు దర్శకుడిగా హిట్ దర్శకుడు శైలేష్ కొలను పేరును కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఈ హిట్ కాంబినేషన్ గురించి ప్రచారం జరుగుతోంది.

శైలేష్ కొలను చెప్పిన కథ విషయంలో వెంకటేష్ తో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ అంతా కూడా సంతృప్తి వ్యక్తం చేయడంతో వెంటనే షూటింగ్ మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం అయ్యిందని తెలుస్తోంది. సినిమా యొక్క మరిన్ని వివరాలను ఈనెల 25వ తారీకున రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించబోతున్నట్లుగా పేర్కొన్నారు.

హిట్ మరియు హిట్ 2 సినిమాలతో దర్శకుడిగా శైలేష్ కొలను మంచి పేరును దక్కించుకున్నాడు. ఇప్పటికే నానితో హిట్ 3 సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. నాని ప్రస్తుతానికి ఉన్న కమిట్ మెంట్స్ కారణంగా హిట్ 3 లేట్ అయ్యేలా ఉంది.

అందుకే ఈ లోపు వెంకటేష్ తో ఆయన మైల్ స్టోన్ మూవీ ని తెరకెక్కించేందుకు దర్శకుడు శైలేష్ కొలను సిద్ధం అయ్యాడు.

సాధారణంగానే వెంకటేష్ తో సినిమా అంటే డైరెక్టర్స్ కి ఛాలెంజ్.. అలాంటిది ఆయన 75వ సినిమా అంటే ఏ స్థాయిలో ఒత్తిడి శైలేష్ కొలను పై ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వెంకటేష్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పై ఆసక్తిగా ఉన్నారు. మరి శైలేష్ కొలను తన హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేసి వెంకీ కి 75వ సినిమాతో హిట్ ఇచ్చేనా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.