Begin typing your search above and press return to search.

RAPO మూవీ కోసం పోటీ పడుతున్న ఓటీటీలు...!

By:  Tupaki Desk   |   9 July 2020 4:30 PM GMT
RAPO మూవీ కోసం పోటీ పడుతున్న ఓటీటీలు...!
X
యువ హీరో రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు రామ్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు మాస్ చిత్రాలను టచ్ చేయని చాక్లెట్ బాయ్ రామ్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ లుక్‌ లో అదరగొట్టేశాడు. ఈ సక్సెస్ ఎంజాయ్ చేసిన రామ్ పోతినేని వెంటనే క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి తిరుమల కిశోర్ దర్శకత్వం వహించగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌ పై 'స్రవంతి' రవికిషోర్ నిర్మించారు. ఇక హీరోయిన్ గా మాళవిక శర్మ నటించగా సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'రెడ్' ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

కాగా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు ఓటీటీ బాట పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుమారు డజను సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలు కూడా క్రేజీ మూవీస్ కి ఫ్యాన్సీ రేట్స్ ని ఆఫర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నాయట. ఈ క్రమంలో రామ్ 'రెడ్' సినిమా కోసం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పోటీ పడుతున్నాయట. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సుమారు 30 కోట్లకు పైగానే 'రెడ్' కోసం ఆఫర్ ఇచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మరో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి ముందుకొచ్చిందట. అయితే మేకర్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఎన్ని రోజులు వెయిట్ చేసైనా థియేటర్స్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఓటీటీల ఆఫర్స్ పై ఏమాత్రం ఆసక్తి చూపలేదట. ఇప్పటికే హీరో రామ్ తన సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేసాడు.