థియేటర్స్ తెరుస్తున్న నేపథ్యంలో నెమ్మదించిన ఓటీటీ రిలీజులు..!

Wed Nov 25 2020 22:30:18 GMT+0530 (IST)

Slow OTT releases in the wake of theaters opening ..!

కరోనా మహమ్మారి కారణంగా మూతబడిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ చేస్తున్నారు. ఈ మధ్య కొన్ని తమిళ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ కూడా చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలను కూడా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ముందుగా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేయడానికి సినిమాలను దక్కించుకున్నప్పటికీ.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ చేసి ఆ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి పెట్టాలని భావిస్తున్నారట. ఈ విషయంలో టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలు ఓటీటీ వారికి తోడ్పాటు అందించడానికి ముందుకు వస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.ఇదే కనుక నిజమైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజులు ఇకపై నెమ్మదించే అవకాశం ఉంది. కాకపోతే అలాంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందింతే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లాభపడినట్లే అని చెప్పవచ్చు. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ పద్ధతిలో నిర్మాతలు ఓటీటీలకు తక్కువ రేట్లకే తమ సినిమాలని అమ్మేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సదరు ఓటీటీలు థియేట్రికల్ రిలీజ్ చేసుకొని లాభపడే అవకాశం ఉంది. ఆ తర్వాత సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ కి పెట్టే అవకాశం ఎలాగూ ఉంది. మెగా హీరో 'సోలో బ్రతికే సో బెటర్' సినిమాని జీ స్టూడియోస్ వారు ముందుగా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసుకునే విధంగా ఒప్పందం చేసుకొని ఇప్పుడు ముందుగా థియేట్రికల్ రిలీజ్ కి వెళ్తున్నారని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.