Begin typing your search above and press return to search.

OMG డాడీ టీజర్: బ్యాడ్ డాడీ గా మారిన బన్నీ!

By:  Tupaki Desk   |   14 Nov 2019 5:41 AM GMT
OMG డాడీ టీజర్: బ్యాడ్ డాడీ గా మారిన బన్నీ!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.. రెండు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు మూడవ పాటకు ముహూర్తం పెట్టారు. 'OMG డాడీ' అంటూ సాగే ఈ పాట టీజర్ ను బాలల దినోత్సవం సందర్భంగా కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ పాట లో అల్లు అయాన్.. అల్లు అర్హలు కనిపిస్తారనే సంగతి తెలిసిందే. దీంతో ఈ పాటపై ఒక్కసారి గా అందరికీ ఆసక్తి పెరిగింది.

ఈ పాట కు సాహిత్యం అందించిన వారు కృష్ణ చైతన్య. "ఓ మై గాడ్ డాడీ జస్ట్ డోంట్ బీ మై బ్యాడీ.. డోంట్ బీ సో హార్డీ దట్ విల్ మేక్ మీ శాడీ" అంటూ టీజర్ లో లైన్స్ ఇంగ్లీష్ లో సాగాయి. ఇంగ్లీష్ నిజం గా వచ్చినవారికి ఎలాగూ ఈ లైన్స్ ఆర్థం అవుతాయి కాబట్టి దిగుల్లేదు. ఒరిద్దరూ నిజంగా రాని వారు కూడా ఉంటారు కదా.. వారి కోసం రఫ్ గా అర్థం చెప్పుకుంటే "నా దృష్టి లో చెడ్డ వాడివి కావొద్దు నాన్నా.. నాతో కరుకు గా ఉండ కు.. నన్ను బాధ పెట్టకు".. ఇది బీకాం ఫిజిక్స్ టైపు అనువాదం కాబట్టి మీరు తత్వవేత్తల్లా తప్పులు ఎన్నకండి. అంతరార్థం మాత్రమే గ్రహించే ప్రయత్నం చెయ్యండి. లైన్స్ అయితే క్యాచీ గా ఉన్నాయి. ఈ పాటను పాడినవారు రోల్ రిడా.. రాహుల్ సిప్లిగంజ్.. బ్లేజీ.. రాహుల్ నంబియార్.. రాబిట్ మ్యాక్.

ఇక వీడియో విషయాని కి వస్తే స్టార్ట్ లోనే 'నాన్న గురించి అయాన్' అంటూ ఇంట్రో ఇచ్చారు. ఇంట్లో అల్లు అర్జున్ పోస్టర్ లను చూస్తూ.. అయాన్ "డాడీ నువ్వు చిరాకు తెప్పిస్తున్నావు.. నా చుక్కలు చూపిస్తున్నావు" అన్నట్టు ఓ ఎక్స్ ప్రెషన్ ఇస్తూ తలను చేత్తో కొట్టుకుంటూ ఉంటాడు.. తర్వాత క్యూట్ అర్హ కూడా ఈ విప్లవవాది అన్నయ్యతో చేరి ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. పోస్టర్ లో డాడీ నవ్వుతూ ఉంటే.. ఈ పిల్లలు మాత్రం 'మాకేంటీ బాధ' అన్నట్టు గా ప్రవర్తిస్తున్నారు. మరి అందరినీ ఎంత గానో అలరించే స్టైలిష్ స్టార్ ఇంత చిన్న పిల్లలను ఎందుకు బాధ పెడుతున్నాడో ఏంటో..!

టీజర్ లో ఒక హైలైట్ ఏంటంటే.. అయాన్ స్టెప్స్.. రెండు సందర్భాల లో అయాన్ స్టెప్స్ బన్నీని గుర్తు తెప్పించాయి. అన్నీ మాట్లాడుకున్నాం అసలు వ్యక్తి థమన్ భయ్యా గురించి మాట్లాడుకోక పోతే ఎలా..? ఎప్పటిలాగే ఈ పాటకూ ఓ క్యాచీ ట్యూన్ ఇచ్చాడు. టీజర్ స్టార్టింగ్ లో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్.. స్టాండ్ అవుట్ గా నిలుస్తుంది. ఓవరాల్ గా మరో క్యాచీ సాంగ్ తో రాబోతున్నారన్నమాట. ఆలస్యం ఎందుకు.. OMG డాడీ టీజర్ చూసేయండి.