Begin typing your search above and press return to search.

OG: ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?

By:  Tupaki Desk   |   31 Jan 2023 3:05 PM GMT
OG: ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు ఏపీ రాజకీయాలతో ఇటు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసిందే. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ లాంచింగ్ వేడుకలో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ లో కనిపించారు.

అయితే సుజిత్ రన్ రాజా రన్ తో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ సొంతం చేస్తుంది. శర్వానంద్, అడవి శేషు నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక మొదటి సినిమాతో హిట్టు కొట్టిన ఈ డైరెక్టర్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో సినిమాను చేశాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. కలెక్షన్స్ పరంగా పర్వాలేదని అనిపించిన ... ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.

అయితే మూడో సినిమాకే పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కొట్టేశాడు. ఈ యంగ్ డైరెక్టర్. అయితే సాహో సినిమా తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తీసుకున్న సుజిత్... ఈ సినిమా స్టోరీ పవన్ కంటే ముందు ఓ స్టార్ హీరో కి వినిపించినట్లు తెలుస్తుంది.

ఆ హీరో ఎవరో కాదు... సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏమైందో తెలియదు కానీ ఈ సినిమాను మహేష్ బాబు వద్దు అనుకున్నట్లు సమాచారం. ఏ కారణాలతో రిజెక్ట్ చేశాడో తెలియదు కానీ... ఈ స్టోరీని పవన్ ఒకే చేశాడు.

దే కాల్ హిట్ OG అనే వ‌ర్కింగ్ టైటిల్‌ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు సుజీత్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు.

అలాగే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజుల డేట్స్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది. ఇక సుజిత్ జెట్ స్పీడ్ ఫినిష్ చేసేలా ప్లాన్ సెట్ చేసుకున్న తరువాతనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.