ఆ ప్రత్యేక గీతంపై కోయినా విమర్శలు

Mon Jul 15 2019 18:18:53 GMT+0530 (IST)

O SAKI SAKI Video Song From Batla House

మొరాకో బ్యూటీ నోరా ఫతేహి డ్యాన్సింగ్ ట్యాలెంట్ గురించి తెలిసిందే. బాహుబలి మనోహరిగా ఈ అమ్మడు యువతరం గుండెల్లో చెరగని ముద్ర వేసింది. శరీరాన్ని ఎంతో సులువుగా విల్లులా వొంచేస్తూ నోరా డ్యాన్సింగ్ విన్యాసాలతో అబ్బురపరుస్తుంది. సాల్సా.. పోల్ డ్యాన్స్ లోనూ నోరా స్పెషలిస్ట్. వెస్ట్రన్ డ్యాన్సులకు తగ్గట్టే శరీరాన్ని తీగలాగా మెయింటెయిన్ చేస్తుంది ఈ భామ. దాదాపు ఆరేడేళ్లుగా బాలీవుడ్ కి ఈ అమ్మడు సుపరిచితం. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ ఐటెమ్ నంబర్లలో నర్తించింది.తాజాగా జాన్ అబ్రహాం నటించిన `బాట్లా హౌస్` చిత్రంలో నోరా ఓ రీమిక్స్ సాంగ్ లో నర్తించింది. `ఓ సఖి సాఖి..` అంటూ సాగే క్లాసిక్ రీమిక్స్ గీతం టీజర్ ని ఇటీవలే రిలీజ్ చేశారు. తాజాగా పూర్తి పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ గీతంలో నోరా డ్యాన్సింగ్ విన్యాసాలు కుర్రకారు గుండెల్ని గుల్ల చేస్తున్నాయి. ఓ వైపు మెరుపు తీగలాగా నర్తిస్తూనే చేతులతో మైనపు ఒత్తుల దండను గిరగిరా తిప్పేస్తోంది. ఇక బ్యాక్ గ్రౌండ్ లో జాన్ అబ్రహాం వార్ ని చూపించారు.  తీవ్రవాదం నేపథ్యంలో సీరియస్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నోరా ఐటెమ్ సాంగ్ ఓ రిలీఫ్ అనే చెప్పాలి. తులసికుమార్ -నేహా కక్కర్- బి ప్రాక్ ఈ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు.

ఇక ఈ గీతంపై నటి కోయినా మిత్రా తీవ్రమైన విమర్శల్ని గుప్పించింది. ఈ పాట ఒరిజినల్ (ముసాఫిర్) గీతంతో పోలిస్తే అస్సలు మ్యాచ్ కాలేదు. ఆ స్థాయిలో ట్యూన్ వినిపించలేదని కోయినా విమర్శించింది. ఈ పాటలో నోరా ఫతేహి నృత్యాలు బావున్నా.. సంగీతం పరంగా చెడగొట్టారనే అర్థంలో కోయినా విమర్శించడం విశేషం. అయితే రీమిక్స్ పాటలకు ఉండే సమస్యనే ఇది. ఒరిజినల్ తో పోలుస్తూ అభిమానులు విమర్శించడం ప్రతిసారీ చూస్తున్నదే. సంజయ్ దత్ - కోయినా మిత్రా ముసాఫిర్ చిత్రంలో ఓ సఖి సఖి సాంగ్ అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ పాటలో కోయినా డ్యాన్సులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఐఫా అవార్డుల్లో ఈ గీతాన్ని ఒక ఆంథెమ్ గా గౌరవించారని.. అలాంటి పాటను రీమిక్స్ చేసి చెడగొట్టారని కోయినా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇకపోతే ఆగస్టు 15న రిలీజవుతున్న బాట్లా హౌస్ ఎలాంటి సంచలనాలు సృష్టించనుంది అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ఈ చిత్ర కథాంశం మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2008లో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదుల్ని ఏరివేసిన ఓ అధికారి కథాంశంతో రియలిస్టిక్ ఘటనలతో రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆకట్టుకుంది.