క్రేజీ స్టార్ లకు నెంబర్ సెంటిమెంట్

Wed May 18 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Number Sentiment for Stars

సినీ ఇండస్ట్రీలో ఆది నుంచి సెంటిమెంట్ లకు పెద్ద పీట వేస్తుంటారన్నది తెలిసిందే. కొత్త సినిమా ప్రకటన నుంచి క్లాప్ కొట్టే ముహూర్తం నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు. అలాగే సినిమా బాక్సులు థియేటర్లకు పంపించి సినిమా రిలీజ్ డేట్ వరకు ఇలా ప్రతీదీ సినిమా వాళ్లకు సెంటిమెంటే. అయితే మన స్టార్ హీరోలకు ఓ నెంబర్ ఇప్పడు అన్నిటికి మించి ప్రధాన సెంటిమెంట్ గా మారిందని చెబుతున్నారు. ఇది మిగతా హీరోల విషయంలో ప్రూవ్ కావడంతో ఇప్పడు స్టార్ హీరోలు కూడా నెంబర్ సెంటిమెంట్ పై కన్నేశారట.కొంత మందికి ఏప్రిల్ నెల సెంటిమెంట్ గా వుంటే మరి కొంత మంది స్టార్స్ కి జనవరి సంక్రాంతి సీజన్ సెంటిమెంట్ గా మారుతోంది. కొంత మంది డిసెంబర్ నెలని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అయితే మన స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల కు మాత్రం  29వ సినిమా సెంటిమెంట్ గా మారిందట. దీనిపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ నెంబర్ సెంటిమెంట్ గేమ్ లో ఇద్దరు స్టార్ హీరోలు పవన్ కల్యాణ్ మహేష్ బాబు ల పేర్లు ప్రధానంగా వినిపిస్తుండటంతో వీరి లైనప్ పై కొత్తగా చర్చ మొదలైంది.

మూడేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన 26వ చిత్రంగా 'వకీల్ సాబ్'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం భారీ విజయాన్ని అందించిన పవన్ కు శుభారంభాన్నిచ్చింది. ఇక దీని తరువాత పీఎస్ పీకే 27 గా చేసిన 'భీమ్లానాయక్' కూడా ఆశించిన స్థాయిలో కాకపోయినా భారీ విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం 28వ చిత్రంగా ముందు ప్రచారం జరిగిన సినిమా 'భవదీయుడు భగత్ సింగ్'. అయితే మద్యలో 'భీమ్లానాయక్' లైన్ లోకి రావడంతో నెంబర్ మారిపోయింది.

ఇప్పడు పీఎస్ పీకే 28వ సినిమా 'హరి హర వీరమల్లు' ని చెబుతున్నారు. వరుస ప్రాజెక్ట్ ల కారణంగా హరీష్ శంకర్ వరుసగా వాయిదాలు పడుతుండటంతో ఈ మూవీని ప్రస్తుతం అయితే పక్కన పెట్టారట. ఇది లైన్ లోకి వస్తే ఇదే పవన్ 29న సినిమా అవుతుంది. లేదంటే రీమేక్ సినిమా 29వ చిత్రంగా లెక్కల్లోకి ఎక్కనుంది. ప్రస్తుతం 'హరి హర వీరమల్లు'లో నటిస్తున్న పవన్ వెంటనే మరో రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. గతంలో విజయ్ హీరోగా నటించి 'థేరి' సినిమాని తెలుగులో 'పోలీసోడు' పేరుతో రిలీజ్ చేసినా దాన్నే పవన్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారని తెలిసింది.

దీనికి 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇప్పటికే కథని పవన్ క్రేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో నే రానున్నందని తెలుస్తోంది. అన్నీ ఫైనల్ అయితే ఇదే పవన్ 29వ సినిమా అవుతుందని తెలుస్తోంది. ఇక ఇదే సెంటిమెంట్ ని సూపర్ స్టార్ మహేష్ కూడా ఫాలో అవుతున్నారు. ఇటీవల తన 27వ చిత్రంగా 'సర్కారు వారి పాట'లో నటించిన మహేష్ త్వరలో తన 28న సినిమాని పట్టాలెక్కించబోతున్నారు.

హీరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ తన 29వ సినిమా చేయబోతున్నారు. పాన్ ఇండియా స్థాయికి మించి తెరపైకి రాబోతున్న ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్నారు. ఇదే మహేష్ తొలి పాన్ ఇండియా మూవీగా రికార్డుల కెక్కబోతుండటంతో ఫ్యాన్స్ ఈ మూవీని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎప్పుడు మొదలవుతుందా? ఆ టైమ్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. పవన్ మహేష్ కు సెంటిమెంట్ గా మారిన 29వ సినిమా ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిదే.