మళ్లీ నెంబర్ వన్ హీరోయిన్ వార్ షురూ

Sat Jan 15 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Number One Heroine War begins again

టాలీవుడ్ లో మళ్లీ నెంబర్ వన్ హీరోయిన్ వార్ మొదలైంది. గతంలో ఈ రేసులో ముగ్గురు నలుగురు హీరోయిన్ లు వుండేవారు. ఒకరు రేస్ లో ఒకబడితే మరో సినిమాతో మరో హీరోయిన్ ట్రాక్ లోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు నెంబర్ వన్ రేసులో మాత్రం ఇద్దరే హీరోయిన్ లున్నారు. వారే కన్నడ సోయగం రష్మిక మందన్న  బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ ఇద్దరి మధ్యే నెంబర్ వన్ వార్ జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప :ది రైజ్` మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.అయితే ఈ మూవీ రష్మికని క్రేజీ హీరోయిన్ ల జాబితాలో చేర్చింది. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోవడంతో రష్మిక ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ రేసులో నిలిచింది. అయితే రష్మిక చేసింది ఒకే ఒక్క పాన్ ఇండియా మూవీ అందులోనూ ఇద్దరు స్టార్ (మహేష్ బన్నీ)లతో మాత్రమే కలిసి నటించింది. కానీ పూజా మాత్రం అలా కాదు.

యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతోనూ కలిసి నటిస్తూ అందరిని కవర్ చేస్తోంది. గత ఏడాది రష్మిక పూజా హెగ్డే సక్సెస్ లని సొంతం చేసుకుని ఈ రేసులో సామానంగా నిలిచారు. కానీ ఈ ఏడాది మాత్రం పూజానే పైచుయి సాధించేలా కనిపిస్తోంది. రష్మిక తెలుగులో పుష్ప -2 ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి రెండు చిత్రాలతో పోటీపడుతుంటే పూజా హెగ్డే మాత్రం ఆచార్య రాధేశ్యామ్ బీస్ట్ వంటి భారీ చిత్రాలతో పోటీపడబోతోంది.

అంతే కాకుండా ఈ ఇద్దరు ఇదే ఏడాది బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. రష్మిక మందన్న `మిషన్ మజ్ను` గుడ్ బై చిత్రాలతో ఈ ఏడాది బాలీవుడ్ లో తన సత్తాని చాటబోతోంది. ఇక ఇంత వరకు పెకండ్ హీరోయిన్ పాత్రలతో సరిపెట్టుకుంటూ వచ్చిన పూజా హెగ్డే ఈ ఏడాది మాత్రం రణ్ వీర్ సింగ్ నటిస్తున్న `సర్కస్` మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోయిన్ ల జాతకం ఈ సినిమాలతో తేలబోతోంది.

బాలీవుడ్ లో తమ సత్తా చాటలని  ప్రయత్నాలు చేస్తున్న రష్మిక పూజా హెగ్డే తెలుగులోనూ తమ ప్రభావాన్ని అదే స్థాయిలో చూపించబోతున్నారు. అయితే ఈ రేసులో పై చేయి ఎవరిది అవుతుంది? .. ఎవరు వెనకడుగు వేస్తారన్నది తెలియాలంటే పుష్ప -2 ఆడవాళ్లు మీకు జోహార్లు రాధేశ్యామ్ ఆచార్య బీస్ట్ చిత్రాలు రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.