పెళ్లాడే మూడ్ లో ఉంటే ఈ గోలేంటీ?

Tue Jan 18 2022 10:49:30 GMT+0530 (IST)

Ntr 30 Latest Rumors

అంతా అనుకున్నట్టు సాగితే 2021లోనే ఆలియా పెళ్లయ్యేది. తాను వలచిన రణబీర్ తో మూడుముళ్ల బంధం ముడిపడేది. కానీ ఎందుకనో అంతకంతకు ఆలస్యమవుతోంది. రణబీర్ కపూర్ తన తండ్రి మరణానంతరం చాలా స్తబ్ధుగానే ఉండిపోయాడు. ఆ తర్వాత కాలక్రమంలో ఆలియా.. రణబీర్ నడుమ ఏదో జరుగుతోందని ఇరువురి నడుమా దూరం పెరిగిందని గుసగుసలు వినిపించాయి. కానీ ఈ బంధంపై ఇటీవల సరైన వార్తలేవీ లేవు.ఇంతలోనే ఆర్.ఆర్.ఆర్ ప్రచారంలో ఆలియా భట్ బిజీ అయ్యింది. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఆర్.ఆర్.ఆర్ హిందీ ప్రమోషన్స్ కోసం మీడియా ఇంటర్వ్యూల్లో ఆలియా హైలైట్ అయ్యింది. కోవిడ్ వల్ల వాయిదా పడగా చాలా నీరసం అలుముకుంది ఈ బ్యూటీలో. తనని పాన్ ఇండియా స్టార్ గా సౌత్ స్టార్ గా అంగీకరించే తరుణంలో ఈ వాయిదా ఆలియాను నిరాశపరిచింది.

అయితే ఇంతలోనే జూనియర్ ఎన్టీఆర్‌తో కొరటాల శివ తదుపరి చిత్రం కోసం ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉన్న అభిమానులు ఆదివారం #NTR30 అనే హ్యాష్ ట్యాగ్ ను సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేసారు.
చిత్ర బృందం ఇంకా ఏమీ ధృవీకరించనప్పటికీ అనిరుధ్ రవిచందర్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ సరసన RRR సహనటి అలియా భట్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపికైందని అభిమానులు ఊహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పూర్తి స్వింగ్ లో ఉన్నందున పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం అనిరుధ్ తో పాటు ఆలియాతో చర్చలు జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఎన్టీఆర్ నటిస్తాడని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నటి ఆలియా సరిజోడు అని కూడా అభిమానులు వైరల్ చేస్తున్నారు.

వచ్చే నెలలో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభం కానుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేసి అప్ డేట్ ఇవ్వమని కోరుతున్నారు. కోవిడ్-19 అనుమతిస్తే మార్చి నుండి సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించవచ్చని కూడా కథనాలొస్తున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి ఓమిక్రాన్ నెమ్మదిస్తుంది. అప్పుడు ప్రతిదీ సులువు అవుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్- అలియా ఇద్దరూ SS రాజమౌళి భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా RRR విడుదల కోసం వేచి ఉన్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరిగా నటించగా సీత పాత్రలో ఆలియా నటించింది. అన్నట్టు పెళ్లాడే మూడ్ లో ఉంటే ఆలియా ఇకపై సినిమాలకు సంతకాలు చేయడం సులువేమీ కాదు. కానీ అందుకు ఆస్కారం కనిపించడం లేదు. మరోవైపు ఆలియా నటించిన  బ్రహ్మాస్త్ర- గంగూభాయి కతియావాడీ లాంటి భారీ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వీటి ప్రచారంలోనూ ఆలియా బిజీ కానుంది.