ఎన్టీఆర్ బాలయ్య సినిమాల కాదు.. నాది డిఫరెంట్: కళ్యాణ్ రామ్

Mon Feb 06 2023 10:02:29 GMT+0530 (India Standard Time)

Not NTR Balayya's movies : Kalyan Ram

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం అమిగోస్. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ లో నటిస్తున్నాడు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... 'తెలుగులో ద్విపాత్రాభినయం రాముడు భీముడు సినిమాతో మా తాతగారు చేశారు. ఆ తరువాత అదే టైటిల్తో బాబాయ్ కూడా చేశారు. చిరంజీవి గారు ముగ్గురు మొనగాళ్లు అనే సినిమాను చేశారు. ఈ అన్నింట్లో ఒకే కామన్ పాయింట్. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల్లా కనిపిస్తారు. కానీ అమిగోస్లో మాత్రం.. యూనిక్ పాయింట్ను చూడబోతోన్నారు. మనుషులను పోలిన మనుషులు ఉంటారనే యూనిక్ పాయింట్తో ఈ సినిమా రాబోతోంది. ఇది కచ్చితంగా మిమ్మల్ని నిరాశ పర్చదు.

దర్శకుడు రాజేంద్ర ఓ కొత్త పాయింట్ను ఎంచుకున్నాడు. బింబిసారా తరువాత మళ్లీ కొత్త కథ చేయాలని అనుకున్నాను. అలాంటి సమయంలోనే అమిగోస్ కథ విన్నాను. కొత్త కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. బింబిసారా టైంలో చెప్పినట్టుగానే ఇప్పుడు చెబుతూ ఉన్నాను. ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా డిజప్పాయింట్ చేయదు. కాలర్ ఎగరేసుకుని చెబుతున్నాను. బ్రహ్మాజీ ఈ సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించారు.

ఆశికకు తెలుగు ఇండస్ట్రీ తరుపున వెల్కమ్ చెబుతున్నాను. నేను వేసిన ప్రతీ అడుగులో నాకు తోడున్న నా తమ్ముడు నా గుండెకాయ ఎన్టీఆర్కు థాంక్స్. ఫిబ్రవరి 10న ఈ సినిమా రాబోతోంది. కచ్చితంగా మీకు కొత్త అనుభూతినిస్తుంది. కొత్త కమర్షియల్ సినిమాను చూడబోతోన్నారు. జోహార్ ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ.. జై హింద్' అని అన్నారు

ఇక ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల అయి ఆకట్టుకుంటుంది. ట్రైలర్లో మూడు డిఫరెంట్ గెటప్ లలో కల్యాణ్ రామ్ ను చక్కటి వేరియేషన్ చూపించారు . ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా విలన్ గా రెండు షేడ్స్లతో కూడిన క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అమిగోస్లో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ సినిమాతోనే ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అమిగోస్ సినిమాను నిర్మిస్తోంది.

బింబిసార సక్సెస్ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న సినిమా ఇది. బింబిసార కమర్షియల్ సక్సెస్ గా నిలవడంతో అమిగోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగినట్లు సమాచారం. . అమిగోస్ తో పాటు ప్రస్తుతం డెవిల్ పేరుతో ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.