బాహుబలి భామ దైవిక మాంత్రికురాలు

Fri Sep 24 2021 14:01:12 GMT+0530 (IST)

Nora Fatehi Stuns You In Her Latest Click

`బాహుబలి ది బిగినింగ్`లో మనోహరీ అంటూ మెరుపుతీగలా తన ఒంపు సొంపులతో ఆకట్టుకుంది కెనడా సోయగం నోరా ఫతే. కిక్2.. షేర్.. లోఫర్.. ఊపిరి వంటి చిత్రాల్లోనూ ప్రత్యేక గీతాల్లో మెరిసి కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది. నిత్యం హాట్ హాట్ అందాలతో కవ్వించే నోరా వైట్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ మాయ చేసింది. నోరా గ్లామర్ షోకు అంతా క్లీన్ బౌల్డ్ అయిపోయారు.రోడ్‌పై తన కార్ పక్కన నిలుచుని నోరా తన భారీ అందాలని ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజులివ్వడం.. ఆ ఫొటోల్ని సోషల్ మీడియా ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఇంటర్నెట్ హీటెక్కిపోయింది. నోరా పరువాల విందుకు ఒక్కసారిగా షాకైన నెటిజన్స్ ఆమె అందాలకు దాసోహం అనేసి ఊహలోకంలో విహరించారు. తాజాగా మరోపసారి అంతకు మించి అన్నట్టుగా నోరా ఓ ఫోని సోషల్ మీడియా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఈ ఫొటోలో నోరా ఫతేహి దైవిక మాంత్రికురాలిగా అబ్బురపరిచింది. తలపై వింత వింత ఆకారంలో కిరీటం ధరించి మాంత్రికురాలిగా మారిపోయింది. విఠలాచార్య సినిమాల్లోని మంత్ర గత్తె తరహా వేషధారణతో ముస్తాబై ఫొటోలకు పోజులిచ్చింది. ఈ డ్రెస్‌ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ అబూ జాన సందీప్ ఖోస్లా.. జోసెఫ్ రాడిక్ `ఇన్ టు ది లైట్` పేరుతో డిజైన్ చేశారు. మంత్ర గత్తె డ్రెస్సులోనూ నోరా తన భారీ అందాలని ప్రదర్శిస్తూ చూపరులకు కనువిందు చేస్తోంది.