Begin typing your search above and press return to search.

కైపెక్కిన క‌ళ్ల‌తో గుండెల్లో మ‌త్తు చ‌ల్లిన మ‌నోహ‌రి

By:  Tupaki Desk   |   24 Jan 2021 1:30 AM GMT
కైపెక్కిన క‌ళ్ల‌తో గుండెల్లో మ‌త్తు చ‌ల్లిన మ‌నోహ‌రి
X
బాహుబ‌లి మ‌నోహ‌రిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన మొరాకో బ్యూటీ నోరా ఫ‌తేహి. బాలీవుడ్ టు టాలీవుడ్ త‌న‌వైన‌ నృత్యాల‌తో.. మ‌త్తెక్కించే అందంతో మ‌న‌సు దోచిన ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లోనూ అంతే స్పీడ్ గా ఉంటోంది. రెగ్యుల‌ర్ గా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది. ఈ అంద‌గ‌త్తె.. తాజాగా ఇన్ స్టాలో మ‌రో హాట్ ఫోటో షూట్ ని షేర్ చేసింది.

లేటెస్ట్ షూట్ కోసం.. నోరా ఫతేహి `సోల్ ఏంజెలాన్` బ్రాండ్ నుండి బ్లాక్ వెల్వెట్ దుస్తులను ఎంపిక చేసుకుంది. ఈ దుస్తుల్లో నోరా మ‌త్తెక్కించే రూపం ఎక్స్ ప్రెష‌న్ ఆకర్షిస్తోంది. ఫోటోలు ఇలా బ‌య‌ట‌ప‌డ‌గానే అలా కుర్రాళ్ల నుంచి కామెంట్లు దూసుకొచ్చాయి. కైపెక్కిన క‌ళ్ల‌తో గుండెల్లో మ‌త్తు చ‌ల్లిన మ‌నోహ‌రి!! అంటూ యూత్ హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

ఇలాంటి వేష‌ధార‌ణ నోరాకి ఇప్పుడే కొత్త కాదు కానీ.. వెల్వెట్ మ‌ఖ‌మ‌ల్ దుస్తుల్లో థై స్లిట్ ఎలివేష‌న్ తో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. నోరా హెయిర్ పాత కాల‌పు రెట్రో స్టైల్ ని ఎలివేట్ చేస్తోంది. నోరా మేకప్ స‌బ్జెక్ట్ చిన్న‌దేమీ కాదు. డ్యూ బేస్.. జెట్ బ్లాక్ కోల్,.. మాస్కరా.. బ్లష్డ్ పింక్ బుగ్గలు .. న్యూడ్ లిప్ స్టిక్ తో కుర్ర గుండెల్ని చిద్రం చేస్తోంది. నోరా ఫతేహి ధరించిన వెల్వెట్ దుస్తుల ధర 1500 డాలర్లు లేదా సుమారు 109499 రూపాయలు ఉంటుంద‌ని తెలుస్తోంది.