నూర్ భాయ్ కి మెగా హీరోలందరి నివాళ్లు

Sun Dec 08 2019 13:05:19 GMT+0530 (IST)

Noor Mohammad, a top mega fan passes away

మెగా వేడుక ఏది జరిగినా కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరవుతూ ఉంటారు. చిన్న వేడుక అయినా పెద్ద వేడుక అయినా కూడా అభిమాన సంఘం అధ్యక్షులు అభిమానులను పెద్ద ఎత్తున గేదర్ చేస్తూ ఉంటారు. అలా హీరోలకు అభిమాన సంఘాల అధ్యక్షులు సన్నిహితం అవుతారు. మెగా హీరోలందరికి కూడా అత్యంత ఆప్తుడిగా పేరు దక్కించుకున్న అభిమాని నూర్ భాయ్. చిరంజీవి నుండి శిరీష్ వరకు అందరి సినిమాల వేడుకలకు తాను ముందుండి అన్ని చూసుకునేవాడు.హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా చాలా కాలంగా చేస్తున్న నూర్ భాయ్ మెగా ఫ్యామిలీ హీరోలందరికి కూడా చాలా ఆప్తుడు. మెగా ఫ్యామిలీలో ఏదైనా వేడుక జరిగినా అక్కడ ఉంటాడు. అలాగే నూర్ భాయ్ ఇంట్లో వేడుక జరిగినా కూడా మెగా హీరోలు వెళ్తారు. అలా మెగా ఫ్యామిలీకి దగ్గర అయిన నూర్ భాయ్ అనారోగ్యంతో మృతి చెందాడు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన నూర్ భాయ్ కి చిరంజీవి.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్.. వరుణ్ తేజ్.. అల్లు శిరీష్.. గీతా ఆర్ట్స్ ఇలా మెగా ఫ్యామిలీకి చెందిన వారు అంతా కూడా నూర్ భాయ్ కి నివాళ్లు అర్పించారు. సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ నూర్ భాయ్ తో ఉన్న అనుబంధంను గుర్తు చేసుకుంటూ నివాళ్లు అర్పిస్తున్నారు.