Begin typing your search above and press return to search.

స్టార్ డాట‌ర్ సినిమాని ఎవ‌రూ కొన‌డం లేద‌ట‌

By:  Tupaki Desk   |   8 Feb 2023 8:00 AM GMT
స్టార్ డాట‌ర్ సినిమాని ఎవ‌రూ కొన‌డం లేద‌ట‌
X
క‌పూర్ ఫ్యాష‌నిస్టా సోనమ్ కపూర్ పెద్ద తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయ్యింది. ఓవైపు త‌న‌ పాపా.. సీనియ‌ర్ న‌టుడు అనీల్ క‌పూర్ షష్ఠిపూర్తి వ‌య‌సులోను క్ష‌ణం తీరిక లేనంత బిజీ షెడ్యూళ్ల‌తో దూసుకుపోతుంటే సోన‌మ్ సినిమాల‌కు దూర‌మైంది. ఏడాది క్రితం త‌న మొద‌టి బిడ్డ రాక‌కు వేళాయింద‌ని ఆనందంగా ప్ర‌క‌టించింది. 2022 ఆగ‌స్టులో బేబి బోయ్ కి బ‌ర్త్ నిచ్చింది. అంజ‌నీపుత్రుడు ఆంజ‌నేయుడి పేరు పెట్టుకుంది. వాయు క‌పూర్ అహూజా అంటూ త‌న‌కు న‌చ్చిన పేరును ఎంపిక చేసుకుంది.

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. చివరిసారిగా 2019 చిత్రం `ది జోయా ఫ్యాక్టర్‌`లో పెద్ద తెరపై కనిపించింది. అప్పటి నుండి ప్రతిసారీ సోన‌మ్ స్టైల్ ఐకాన్ గా ఫ్యాషన్ స్టేట్ మెంట్ ల‌తో అభిమానుల‌కు కూడా ట‌చ్ లో లేదు. సినిమాల నుండి దూర‌మైంది. అయితే డెలివరీ తర్వాత సోనమ్ 2011 కొరియన్ చిత్రం `బ్లైండ్` అధికారిక రీమేక్ తో అభిమానుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ చిత్రం 2022లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా మహమ్మారి ఆంక్షల కారణంగా ఆలస్యమైంది. దీని తరువాత బ్లైండ్ నిర్మాత‌లు OTT విడుదలకు వెళ‌తామ‌ని వెల్ల‌డించారు. అయితే అప్పటి నుండి ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఆల‌స్య‌మైంద‌ని.. స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నార‌ని వెల్లడైంది. ఇప్పుడు సోనమ్ నటించిన బ్లైండ్ రిలీజ్ మ‌రింత‌గా ఆలస్యం కానుంద‌ని తెలుస్తోంది.

తాజా స‌మాచారం ప్రకారం.. బ్లైండ్ మేకర్స్ ఈ చిత్రాన్ని OTT ల‌కు విక్ర‌యించాల‌ని చూసినా స‌ద‌రు కంపెనీలు వెన‌కాడుతున్నాయ‌ని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మొదట్లో థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ మహమ్మారి కారణంగా సినిమాను నేరుగా OTTలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. థియేట్రికల్ విడుదల ఇప్పటికీ లాంఛనప్రాయమే అయినా కానీ చిత్ర నిర్మాతలు OTT డీల్ ని ముగించ‌డంలో చాలా కష్టపడుతున్నారని ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెలువ‌రిస్తోంది.

బ్లైండ్ మేకర్స్ ఈ సినిమాని భారీ మొత్తానికి విక్రయించాలని చూస్తున్నారు. 40 కోట్ల వ‌ర‌కూ ఓటీటీ డీల్ కోసం అడుగుతున్నార‌ని తెలిసింది. అయితే ఇది అధిక మొత్తం కావ‌డంతో మార్కెట్ వెన‌కాడుతోంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే ఏదైనా స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ని క‌నుగొనేందుకు టీమ్ శ్ర‌మిస్తోంది. OTT రైట్స్ కోసం రూ. 40 కోట్ల మేర చెల్లించేందుకు వెన‌కాడుతున్నాయ‌ని అందుకే డీల్ కుద‌ర‌లేద‌ని తెలుస్తోంది. అంత పెద్ద మొత్తాన్ని నేటి కాలంలో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లు వెచ్చించ‌డం రిస్కుతో కూడుకున్న‌ది. కానీ త‌మ కంటెంట్ పై ఉన్న న‌మ్మ‌కంతో బ్లైండ్ నిర్మాత‌లు ధరను త‌గ్గ‌డం లేదు. స్టీమింగ్ ప్లాట్ ఫారమ్ లు అంత పెద్ద‌ మొత్తాన్ని ఖర్చు చేయడానికి సిద్ధంగా లేవు.

కార‌ణం ఏదైనా బ్లైండ్ నిర్మాతలు విడుదల తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అస్పష్టంగానే ఉంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి కొనుగోలు చేస్తారా లేదా అనేది ఇప్ప‌టికి స‌స్పెన్స్ గానే ఉంద‌ని స‌మాచారం. ఈ చిత్రం విషయానికొస్తే.. బ్లైండ్ డిసెంబర్ 2020లో స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో సెట్స్ పైకి వెళ్లింది. ఫిబ్రవరి 2021 ప్రారంభం నుండి భారీ షెడ్యూల్ లో షూట్ పూర్తయింది. మొదట్లో నేరుగా OTTలో విడుదల చేయాలని భావించారు. కానీ ఇంత‌లోనే మ‌న‌సు మారి మేకర్స్ తర్వాత థియేటర్ ల‌లో విడుద‌ల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల వారు థియేటర్ లలో విడుదల చేయకుండా ప్లాన్ ని మార్చుకున్నారు.

బ్లైండ్ అదే పేరుతో 2011 కొరియన్ చిత్రానికి అధికారిక రీమేక్. సీరియల్ కిల్లర్ కోసం అన్వేషణలో బ్లైండ్ పోలీస్ ఆఫీస‌ర్ ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. నూతన దర్శకుడు షోమ్ మఖిజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పురబ్ కోహ్లీ- వినయ్ పాఠక్ - లిల్లేట్ దూబే కూడా నటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.