Begin typing your search above and press return to search.

అద్దె ఇంటి కోసం హీరోయిన్ తిప్పలు..!

By:  Tupaki Desk   |   25 Jan 2023 2:00 PM GMT
అద్దె ఇంటి కోసం హీరోయిన్ తిప్పలు..!
X
సీరియల్ యాక్ట్రెస్ అయిన ఉర్ఫి జావెద్ బిగ్ బాస్ తో ఇంకాస్త ఎక్కువ మంది ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ మీడియాకు ఆమె పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఉర్ఫి జావెద్ తనకు ముంబైలో అద్దెకు ఇల్లు దొరకట్లేదని అంటుంది. తన డ్రెసింగ్ సెన్స్ మీద కామెంట్స్ చేసిన వారికి అదే రేంజ్ లో సమాధానం చెప్పే ఈ అమ్మడు లేటెస్ట్ గా తనకో రెంటల్ హౌజ్ కావాలన ఎవరు అద్దె ఇల్లు ఇవ్వట్లేదని అంటుంది.

తన సోషల్ మీడియాలో తనే స్వయంగా ఒక కామెంట్ పెట్టింది ఉర్ఫి జావెద్. తను ముస్లిం అవడం వల్ల తన డ్రెస్ సెన్స్ చూసి ఎవరు తనకు రెంట్ ఇవ్వడం లేదని.. ఇక హిందీ వాళ్లేమో తానొక ముస్లిం అవడం వల్ల ఇల్లు అద్దెకు ఇవ్వట్లేదని రాసుకొచ్చింది ఉర్ఫి జావెద్. ముంబైలో అద్దె ఇల్లు వెతకడం చాలా కష్టంగా ఉందని చెప్పింది ఉర్ఫి జావెద్. బాలీవుడ్ సీరియల్స్ తో పాపులర్ అయిన ఉర్ఫి జావెద్ బిగ్ బాస్ ఓటీటీతో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

బుల్లితెరలో సీరియల్స్ చేస్తూ వచ్చిన ఉర్ఫి సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. తన గ్లామర్ ఎటాక్ తో ఫాలోవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉర్ఫి కెరీర్ లో తనదైన శైలిలో దూసుకెళ్తుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని పర్ఫెక్ట్ గా వాడేస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తుంది. ప్రస్తుతం అద్దె ఇంటి కోసం తను పడే కష్టాన్ని ప్రేక్షకులతో పంచుకుంది ఉర్ఫి.

ఎవరేం చెప్పినా సరే ఎవరికోసమో తన డ్రెసింగ్ స్టైల్ మార్చుకునేది లేదని అంటుంది ఉర్ఫి. ఎవరికైనా సరే వారికి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు ఉంటుందని.. అందరిలానే తను కూడా తనకు నచ్చిన డ్రెస్ లను వేసుకుంటా అని అంటుంది ఉర్ఫి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.