కొనేవాళ్లు లేక PS 2 కష్టాలు..!

Fri Mar 17 2023 07:00:01 GMT+0530 (India Standard Time)

No buyers is coming forward to buy PS2 movie

ప్రముఖ భారతీయ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ ఏ రేంజ్ లో హిట్టు అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించగా.. మొదటి భాగాన్ని గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేశారు. అయితే ఈ సినిమా రెండో భాగాన్ని ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సమయంలోనే ఈ చిత్రానికి అనేక కష్టాలు మొదలు అయ్యాయి.దర్శక నిర్మాతలకు సినిమాను అమ్ముకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదట. ఒక్క తమిళనాడులో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో భారీ డిజాస్టర్ గా నిలుస్తోంది. కార్తీ విక్రమ్ జయం రవి ఐశ్వర్య రాయ్ త్రిష తదితరులు ఈ హిస్టారికల్ సినిమాలో నటించి మెప్పించారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్టు అయింది.

ఈ క్రమంలోనే రెండో భాగంపై కూడా చిత్రబృందం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. అయితే ఎప్పటి నుంచో పొన్నియన్ సెల్వన్ 2ను ప్రేక్షకుల ముందుకు తేవాలని మణిరత్నం చూస్తుండగా... ఒకటి రెండు సార్లు ప్రయత్నాలు చేసినా అది కుదరలేదట. అయితే ఇన్నేళ్లకు ఆ కల నెరవేరింది. కానీ బయర్స్ లేకపోవడంతో.. డైరెక్టర్ ప్రొడ్యూసర్లు ఇద్దరూ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ముఖ్యంగా తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఈ చిత్రం రిలీజ్ కు ముందే డిజాస్టర్ గా నిలుస్తుండడంతో తెగ హైరానా పడిపోతున్నారట డైరెక్టర్ మణిరత్నం.

ఈ సినిమా రెండు భాగాలను దాదాపు 500 కోట్ల రూపాయలతో ఒకేసారి చిత్రీకరించారు. అయితే మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు ఒక్క తమిళంలోనే 200 కోట్లకు పైగా రాబట్టింది. తమిళనాడులో 200 కోట్ల రూపాయలు సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం తమిళ నేటివిటీతోనే తెరకెక్కించడంతో అక్కడ మాత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే పార్ట్ 2 కూడా తమిళ్ లో తప్ప ఎక్కడా సినిమా హక్కులను కొనేందుకు బయర్స్ ముందుకు రావట్లేదు.  నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.